Double Entry Votes: ఒక వ్యక్తికి ఒకటే ఓటు, డబుల్ ఎంట్రీ ఓట్లపై చర్యలకు దిగిన ఎన్నికల సంఘం

Double Entry Votes: ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కుపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా చర్యలకు ఉపక్రమించింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం తెలుగుదేశం ఫిర్యాదులపై స్పందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 9, 2023, 10:19 AM IST
Double Entry Votes: ఒక వ్యక్తికి ఒకటే ఓటు, డబుల్ ఎంట్రీ ఓట్లపై చర్యలకు దిగిన ఎన్నికల సంఘం

Double Entry Votes: తెలంగాణ ఎన్నికలు ముగిసిన తరువాత ఏపీలో డబుల్ ఎంట్రీ ఓట్ల పంచాయితీ ప్రారంభమైంది. తెలంగాణలో ఓటేసి తిరిగి ఏపీలో ఓటేసేందుకు సిద్ధమౌతున్నారనే బలమైన ఆధారాలతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. డబుల్ ఎంట్రీ ఓట్లపై చర్యలు తీసుకోవాలని కోరింది. తాజాగా తెలుగుదేశం కూడా ఈసీకు ఇదే విషయం విన్నవించింది. 

ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత కీలకమైంది. ఒక వ్యక్తికి ఒకే ఓటు హక్కుండాలి. అది స్థానికత ఆధారంగా ఏదో ఒక ప్రాంతంలోనే ఉండాలి. కానీ దేశంలో ఆ పరిస్థితి లేదు. ఉపాధి, ఉద్యోగ ఇలా వేర్వేరు కారణాలతో ఇతర రాష్ట్రాల్లో స్థిరపడినవారు రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగి ఉంటున్నారు. అంతేకాదు. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు సందర్భాల్లో ఎన్నికలు జరిగితే రెండు చోట్లా ఓటేసేందుకు సిద్దమైపోతున్నారు. ఈ సంఖ్య వందల్లో వేలల్లో కాకుండా లక్షల్లో ఉండటం ఆందోళన కల్గిస్తోంది. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తరువాత ఈ అంశంపై చర్చ జరిగింది. ఈ డ్యూయల్ ఓట్లు లేదా డబుల్ ఎంట్రీ ఓట్లపై ముందుగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఏపీ, తెలంగాణలో ఓటు హక్కు కలిగినవాళ్లు 5 లక్షల వరకూ ఉన్నారని, ఒకే ఓటు హక్కు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇటీవల ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా ఈసీకు ఫిర్యాదు చేసింది. 

దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఓటు హక్కు కలిగినవారికి చెక్ పెడతూ డూప్లికేట్, డబుల్ ఎంట్రీ ఓట్లపై దృష్టి సారించింది. ఒక్కొక్కరికి వేరే రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు ఉందనే ఫిర్యాదులపై చర్యలు చేపట్టింది. ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు హక్కు ఉండాలని, ఒకటికంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉండటం నిబందనలకు విరుద్దమని తేల్చి చెప్పింది. ఫామ్ 6 ద్వారా మాత్రమే కొత్త ఓటు హక్కు నమోదు చేయాలని , దీనికోసం మరెక్కడా ఓటు హక్కు లేదనే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. తప్పుడు డిక్లరేషన్ ఇస్తే కేసులు పెట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. డిక్లరేషన్ తప్పైతే జైలు శిక్ష ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 

20 ఏళ్లు పైబడినవాళ్లు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేస్తే అధికారులు విచారించి రిమార్క్ ఇవ్వాలని ఏపీ ఎన్నికల కమీషనర్ మీనా తెలిపారు. ఎక్కడ నివాసముంటే అక్కడే ఓటు హక్కు ఉండాలని, ఇళ్లు మారేవాళ్లు ఓటుకు ఫామ్ 8 ద్వారా డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. 

Also read: Dual Votes: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో డబుల్ ఎంట్రీ ఓట్లు, తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల రాజకీయం, ఈసీకు ఫిర్యాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News