Pushpa 2: అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పుష్ప టీజర్ కి ఒక్కరోజు ముందు!
Pushpa 2 Teaser: పుష్ప మొదటి పార్ట్ సాధించిన సక్సెస్ తో ఈ చిత్రం రెండో భాగం పైన ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం టీజర్ రేపు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఒక్కరోజు ముందు అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది…
Allu Arjun Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. కాగా ప్రస్తుతం ఈ చిత్రం రెండో భాగం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియో సినిమా పైన అంచనాలను పెంచేశాయి. ఇక ఈ చిత్రం టీజర్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని తెగ ఎదురుచూస్తున్నారు అభిమానులు.
ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేపు ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నాము అని సినిమా యూనిట్ ప్రకటించింది. ఇక ఈ టీజర్ కోసం అందరూ ఎదురు చూస్తుండగా అల్లు అర్జున్ కరెక్ట్ గా ఒక్కరోజు ముందు అనగా ఈరోజు.. ఒక ఇంట్రెస్టింగ్ స్టేటస్ పెట్టారు.
అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ లో.. అంతా సిద్ధం అయిపోయింది అంటూ క్యాప్షన్ పెట్టి.. పెద్ద స్క్రీన్ పైన పుష్ప 2 టైటిల్ ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఇక ఈ ఫోటో ద్వారా పుష్ప టీజర్ సిద్ధంగా ఉంది అని.. రేపు విడుదల చేస్తున్నాము అని క్లారిటీ ఇచ్చేశారు ఈ హీరో. ఇక ఈ పోస్టుతో అల్లు అర్జున్ అభిమానుల ఆసక్తి మరింత రెట్టింపు అయింది.
కాగా పుష్ప పార్ట్ 1 క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌తో పుష్ప పార్ట్ 2పై బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ‘పుష్పరాజ్’ పార్ట్2 రెడీ అయ్యారు అని వినికిడి. సుకుమార్ ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని ఈ చిత్రం తప్పకుండా మొదటి పార్ట్ కన్నా ఎక్కువ విజయం సాధిస్తుంది అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలి అంటే ఏప్రిల్ 15 వరకు వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook