Allu Arjun Special Wishes సమంత, దేవ్ మోహన్ కాంబినేషన్‌లో గుణ శేఖర్ శాకుంతలం అనే సినిమాను తెరకెక్కించాడు. దిల్ రాజు బ్యాక్ బోన్‌గా నిలవడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా శాకుంతలంలో భరతుడు పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్‌లో ఇప్పటికే ఆర్హ కనిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో అర్హ కనిపించబోతోంది. దీంతో తన కూతురు డెబ్యూపై బన్నీ ఎమోషనల్ అయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాకుంతలం విడుదల సందర్భంగా చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్.. ఇంత గొప్ప సినిమాను నిర్మించిన గుణశేఖర్ గారు, నీలిమ గుణ, ఎస్వీసీ బ్యానర్‌కు ఆల్ ది బెస్ట్.. నా స్వీటెస్ట్ లేడీ సమంతకు ఆల్ ది బెస్ట్.. మై మల్లు బ్రదర్ దేవ్ మోహన్‌, టీం మొత్తానికి థాంక్స్..  అల్లు అర్హ పోషించిన అతిథి పాత్ర మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా.. నా పాపను తెరపైకి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసిన గుణశేఖర్‌ గారికి థాంక్స్. ఇది నాకు ఎప్పటికీ ప్రత్యేక అనుభూతిగా నిలుస్తుంది అని అల్లు అర్జున్ ట్వీట్ వేశాడు.


 



ఇక సమంత శాకుంతలం సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపించేలా కనిపించడం లేదు. సమంతకు ఈ సినిమా చేదు అనుభవంగానే నిలిచేలా ఉంది. ఈ సినిమాపై సోషల్ మీడియాలోనూ ఎటువంటి బజ్ కనిపించడం లేదు. ముందుగా వేసిన ప్రీమియర్ షో నుంచి నెగెటివ్ టాక్ వచ్చేసింది. ఇప్పుడు పూర్తి స్థాయి రివ్యూలు కూడా వచ్చాయి. మౌత్ టాక్ కూడా సినిమాకు కలిసి రావడం లేదు.


Also Read:  Samantha : సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే


సినిమా మేకింగ్‌లో అద్భుతం ఏమీ జరగలేదని, వీఎఫ్‌ఎక్స్ పూర్‌గా ఉన్నాయని, త్రీడీలోనూ ఎలాంటి అనుభూతి కలగలేదని, సమంత డబ్బింగ్ సెట్ అవ్వలేదని, కథ నీరసంగా సాగడం వంటివి సినిమాకు ప్రధాన మైనస్‌లు నిలిచాయని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియన్ వైడ్‌గా అయితే శాకుంతలం ఎటువంటి చడీచప్పుడూ, హంగామా చేసినట్టుగా కనిపించడం లేదు.


Also Read: Renu Desai : పవన్ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడు?.. నిలదీసిన నెటిజన్.. రేణూ దేశాయ్ రిప్లై వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook