Pushpa The Rule New Poster : నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫర్ట్.. అమ్మోరు అవతారంలో అల్లు అర్జున్
Pushpa The Rule New Poster అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) నిజంగానే స్పెషల్‌గా మారింది. సుకుమార్ ఇచ్చిన అప్డేట్లకు ఒక్కొక్కరి మైండ్ పోయేలా ఉంది. వేర్ ఈజ్ పుష్ప అంటూ ఆశ్చర్యపరిచిన కొద్ది సేపటికే కొత్త పోస్టర్‌తో అందరినీ వావ్ అనిపించాడు
Pushpa The Rule New Poster పుష్ప సినిమా నేషనల్ వైడ్‌గా ఎంతటి సునామినీ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఇప్పుడు రెండో పార్ట్ కోసం దేశం అంతా ఎదురుచూసేలా చేసింది. ఆ ఎదురుచూపులకు తగ్గట్టుగా అప్డేట్లు ఇచ్చాడు సుకుమార్. బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన అప్డేట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
వేర్ ఈజ్ పుష్ప అంటూ వదిలిన ఈ చిన్న పాటి వీడియోలో ఎన్నో క్లూలు వదిలాడు. నెక్ట్స్ సినిమా ఎలా ఉండబోతోందో చిన్న హింట్ ఇచ్చాడు. పుష్ప స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన డబ్బు అంతా కూడా పేదల కోసం ఖర్చు పెట్టి వారి గుండెల్లో దేవుడిగా నిలిపోయేట్టు కనిపిస్తున్నాడు. ఇక తనకంటూ సపరేట్‌గా సైన్యాన్ని, ప్రభుత్వాన్ని ఏర్పర్చుకున్నట్టు అనిపిస్తోంది.
Also Read: Ravanasura Movie Review : రావణాసుర రివ్యూ.. లాజిక్స్ వెతికితే కష్టమేరా
ఇక పులి సైతం భయపడి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే.. పుష్ప వచ్చాడని అర్థం అంటూ చెప్పిన డైలాగ్, చూపించిన విజువల్స్, ఎలివేషన్స్ సినిమా ఏ రేంజ్‌లో ఉంటోందో చెప్పేశాడు సుకుమార్. ఇక ఇందులో విజువల్స్, ఆర్ఆర్ అన్నీ కూడా అదిరిపోయాయి. ఇదంతా ఒకెత్తు అయితే.. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇంకో ఎత్తులా ఉంది.
కాళీ మాతా అవతారంలో అల్లు అర్జున్ కనిపించాడు. దీన్ని చూస్తుంటే కొందరు కాంతారా క్లైమాక్స్‌తో పోల్చుతున్నారు. అయితే చిత్తూరులో ఇదొక సంప్రదాయం ఉందని తెలుస్తోంది. అక్కడి నేటివిటీని పట్టే ఈ సీన్‌ను పెట్టి ఉంటారని ఇంకొందరు అంటున్నారు. ఏది ఏమైనా సుకుమార్ మాత్రం ఈ సారి కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతోన్నట్టుగా తెలుస్తోంది. పుష్ప సీక్వెల్స్ ఇంకా వస్తాయని, మూడో పార్ట్ కూడా ఉందని తెలుస్తోంది. గంగమ్మ తల్లి జాతరా.. కోళ్లు పొట్టేళ్ల కోతరా.. కత్తికి నెత్తుటి పాతరా.. దేవతకైనా తప్పదు ఎరా.. ఇది లోకం తలరాతరా అంటూ మైత్రీ వేసిన ట్వీట్, షేర్ చేసిన పోస్టర్ నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.
Also Read: Ravanasura Twitter Review: రావణాసుర ట్విట్టర్ రివ్యూ.. మళ్లీ ఇలాంటివి చేయకు అన్న!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook