Pushpa 2 Update: 2021 డిసెంబర్ లో విడుదలైన పుష్ప సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన.. అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే.. కాక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా రెండవ భాగం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప: ది రూల్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి మూడేళ్లు అవుతుంది. కానీ ఈ సినిమా మాత్రం ఇంకా విడుదల కావడంలేదు. అసలైతే ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15 విడుదల కావాలి. కానీ ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాకపోవడంతో .. చిత్ర బృందం సినిమాని డిసెంబర్ 6 కి వాయిదా వేసింది.


సినిమా వాయిదా అయితే పడింది కానీ.. పనులు మాత్రం అనుకున్నంత త్వరగా పూర్తి కావడం లేదు. దీంతో అల్లు అర్జున్ విసిగిపోయినట్లు తెలుస్తోంది. ఇంకా నెల రోజులకి సరిపడా.. షూటింగ్ ఉందట. కానీ అల్లు అర్జున్ సుకుమార్ మీద కోపంతో షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారట. ఇప్పటికీ సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. సుకుమార్ షూటింగ్ విషయంలో ఇంకా ఆలస్యం చేస్తూ ఉండడంతో అల్లు అర్జున్ బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో వేకేషన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. 


కావాలి అంటే ఒక నెల మొత్తం బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ చేయడానికి అల్లు అర్జున్ సిద్ధంగా ఉన్నారని సమాచారం. కానీ సుకుమార్ మాత్రం షూటింగ్ పనులు చాలా నెమ్మదిగా చేస్తూ ఉండడంతో చిరాకు వచ్చిన అల్లు అర్జున్ గడ్డం కూడా ట్రిమ్ చేసేసారు. ఈ నేపథ్యంలో గడ్డం లేకుండా.. అల్లు అర్జున్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ గా మరి. 


 



ఇప్పటికే పుష్ప 2 సినిమా షూటింగ్లో పడి.. అట్లీతో సినిమా కూడా వదులుకున్నాడు అల్లు అర్జున్. కానీ సుకుమార్ మాత్రం ఈ సినిమా షూటింగ్ ఎప్పటికీ తేల్చడం లేదు. కొందరేమో సుకుమార్ వైఖరి నచ్చకే బ్రేక్ తీసుకున్నట్లు చెబుతున్నారు. మరికొందరు మాత్రం షూటింగ్ మధ్యలో మామూలుగానే బ్రేక్ తీసుకున్నారని.. అంతే తప్ప ఎలాంటి గొడవలు లేవు అని కామెంట్లు చేస్తున్నారు. మరి ఎందులో నిజం ఉందో వేచి చూడాలి.


Also Read: Kavitha Hospitalise: జైల్లో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత ఆస్పత్రికి తరలింపు.. గులాబీ పార్టీలో కలవరం


Also Read: Gudem Mahipal Reddy: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే... ఈడీ నుంచి రక్షణ కోసమేనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి