Allu Arjun to enter Salman Khan hosted show Bigg Boss 15 Pushpa Movie Promotions : ఐకాన్ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప మూవీతో బిజీగా ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో పుష్ప మూవీ యూనిట్ ప్రమోషన్స్‌ స్టార్ట్ చేయనుంది. బన్నీ (Bunny) కూడా ప్రమోషన్స్ చేయడంలో మరింత బిజీ కానున్నారు. పాన్‌ ఇండియా లెవెల్లో (Pan India level) పుష్ప మూవీ ప్రమోట్‌ చేసేందుకు మూవీ యూనిట్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. బాలీవుడ్‌లో (Bollywood) ఈ మూవీని బాగా ప్రమోట్‌ చెయ్యాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు స్వయంగా అల్లుఅర్జున్నే (Allu Arjun) రంగంలోకి దిగుతున్నారట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌లో అల్లు అర్జున్ స్పెషల్‌ ఎంట్రీ ఇవ్వనున్నారట. పుష్ప ప్రమోషన్స్‌లో (Pushpa Promotions‌) భాగంగానే అల్లు అర్జున్ (Allu Arjun) ఈ షోలో సందడి చేయనున్నారు.


Also Read : Shiva Shankar Master passes away : డ్యాన్స్ మాస్టర్ శివ శంకర్‌ ఇకలేరు



 


​​ఇక అల్లు అర్జున్, సల్మాన్‌ ల (Salman‌) మధ్య మంచి ర్యాపో ఉంది. అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం(డీజే) మూవీలోని సీటీమార్‌ సాంగ్‌ ను.. సల్మాన్‌ ఖాన్ తన రాధే మూవీలో వాడుకున్నారు. అంతేకాదు ఈ పాట విషయంలో సల్లూ భాయ్ బన్నీకి థ్యాంక్స్ చెప్పారు. బన్నీ (Bunny) డ్యాన్స్ కూడా మస్తు ఉంటదని సల్మాన్​ మెచ్చుకున్నాడు.ఇక అల్లు అర్జున్ హిందీలో మల్టీస్టారర్‌ మూవీ (Multistarrer‌ Movie) చేయడానికి కూడా రెడీ అవుతున్నారంటూ టాక్ నడుస్తోంది. బాలీవుడ్ హీరో షాహిద్‌ కపూర్‌ తో బన్నీ (Bunny) స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.



Also Read : Reliance Jio: యూజర్లకు రిలయన్స్ జియో షాక్​- ఛార్జీలు పెంచుతూ నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 



మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook