Choreographer Shiva Shankar master passes away: ప్రముఖ డ్యాన్స్ మాస్టర్.. శివ శంకర్ మాస్టర్ ఇక లేరు. కరోనా బారిన పడ్డ శివ శంకర్ మాస్టర్ (72) హైదరాబాద్ ఏఐజీలో చికిత్స పొందుతూ మరణించారు. శివశంకర్ మాస్టర్ (Shiva Shankar master) ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో... ఆయన ఆరోగ్యం విషమంగా మారి చనిపోయినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కరోనాతో పోరాడుతున్నారు. శివశంకర్ మాస్టర్ కన్నుమూయడంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తమిళ, తెలుగు మూవీలతో పాటు పలు భాషల్లో ఎనిమిదివందలకు పైగా మూవీల్లో ఆయన డ్యాన్స్ మాస్టర్‌గా (Choreographer) పని చేశారు. శివశంకర్ మాస్టర్ 1948 డిసెంబరు 7న చెన్నైలో (Chennai) జన్మించారు. పాట్టు భరతమమ్ మూవీకి 1975లో ఆయన అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్‌గా (Assistant Dance Master) వర్క్ చేసి.. సినీ ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభించారు.
కురువికూడు మూవీతో డ్యాన్స్ మాస్టర్‌గా మారారు శివశంకర్ మాస్టర్. డ్యాన్స్ మాస్టర్‌గానే కాదు.. ఆర్టిస్ట్‌గానూ పలు మూవీల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా (Character Artist), కమెడియన్‌గా నవ్వులు పూయించారు. బుల్లితెర పై కూడా తనదైన ముద్ర వేశారు శివ శంకర్ మాస్టర్. పలు షోలకు జడ్జిగా వ్యవహించారు. శివ శంకర్ మాస్టర్‌కు ((Shiva Shankar master)) విజయ్ శివ శంకర్, అజయ్ శివ శంకర్ అనే ఇద్దరు కుమారులున్నారు. వారిద్దరూ డ్యాన్స్ మాస్టర్లే.
Also Read : Ram Charan Siddha Teaser: ‘ఆచార్య’ నుంచి సిద్ధ టీజర్.. చిరంజీవి, చరణ్ లుక్ అదుర్స్
ఇక రామ్‌చరణ్ హీరోగా రాజమౌళి (Rajamouli) డైరెక్షన్‌లో వచ్చిన మగధీర మూవీలో ధీర ధీర సాంగ్‌కు శివ శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ. ఇందుకుగాను ఆయనకు ఉత్తమ జాతీయ నృత్య దర్శకుడిగా అవార్డు వచ్చింది. అంతేకాదు నాలుగు సార్లు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను సొంతం చేసుకున్నారు శివశంకర్ మాస్టర్.
Also Read : Reliance Jio: యూజర్లకు రిలయన్స్ జియో షాక్- ఛార్జీలు పెంచుతూ నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook