Allu Arjun :పుష్ప మూవీతో బన్నీ సినీ కెరియర్ 360 డిగ్రీస్ టర్నింగ్ తీసుకుంది. కేవలం టాలీవుడ్  ప్రేక్షకులనే కాకుండా వరల్డ్ వైడ్ అభిమానులను తన ఖాతాలో వేసుకున్నాడు పుష్పరాజ్. మరి ముఖ్యంగా పుష్పా లో అల్లు అర్జున్ స్టైల్ ఆఫ్ వాకింగ్.. ఆ భుజం ఎత్తి నిలబడే మేనరిజం.. అతనికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. చూపే బంగారమాయనే శ్రీవల్లి.. సాంగ్ కి అల్లు అర్జున్ ని ఇమిటేట్ చేస్తూ విదేశీ సెలబ్రిటీలు కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. కాగా ఇప్పుడూ ఈ హీరో త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ సెలెక్ట్ అయిందన్న విషయం అందరిని ఆకట్టుకుంటుంది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఈ, మూవీ తర్వాత వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ బన్నీ కోసం  లైన్ లో ఉన్నాయి. వాటిలో ఒకటి అల్లు అర్జున్ ,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న కొత్త మూవీ. ఇప్పటికే ఈ ఇద్దరి క్రేజీ కాంబో నుంచి జులాయి ,సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. జులాయి మూవీ బన్నీ కెరీర్ కు మాంచి హైప్ ఇవ్వగా.. సన్నాఫ్ సత్యమూర్తి అతనిలోని వైవిధ్యమైన నటుడికి మెరుగులు దిద్దింది.. ఇక అల వైకుంఠపురము మూవీ బన్నీని ఒక సాలిడ్ స్టార్ గా ఆవిష్కరించింది.


దీంతో నాలుగవసారి రాబోయే ఈ క్రేజీ కాంబో పై అందరి దృష్టి ఉంది. మూవీ 2024 ఏప్రిల్ నుంచి ప్రారంభం కాబోతోంది అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ మూవీ లో  హీరోయిన్ ఎవరో తెలుసా? అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ దీపికా పడుకోణె. దీపిక ఇప్పటికే ప్రభాస్ ప్రాజెక్టు కె మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. 


 దీపికా  ఒక ఇంటర్వ్యూలో తనకు జూనియర్ ఎన్టీఆర్,అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టం అని చెబుతూ అల్లు అర్జున్ తో నటించాలని ఉంది అన్న కోరికను కూడా వ్యక్తం చేసింది. ఇది పాత సంగతి అయినప్పటికీ కొత్తగా వీళ్ళిద్దరి కాంబో వస్తుంది అనగానే ఈ వార్త కూడా తిరిగి వెలుగులోకి వచ్చింది.ఈ మూవీ లో రెండో హీరోయిన్ గా పూజ హెగ్డే ని తీసుకునే అవకాశం ఉందట. ఇదే జరిగితే అల వైకుంఠపురం హిట్ కాంబో ని తిరిగి ఒకసారి స్క్రీన్ పైన చూసే అవకాశం ఫాన్స్ కి కలుగుతుంది. ఇక ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన దీపికా, అల్లు అర్జున్ తో నటిస్తోంది అంటే ఇక ఫాన్స్ కి పండగే. అల్లు అర్జున్ డాన్స్ స్టైల్ కి దీపిక జోష్ యాడ్ అయితే.. ఇక వాళ్లు వేసే స్టెప్స్ కు స్క్రీన్ అదరాల్సిందే. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అన్న విషయం హీరోయిన్ పేరు అనౌన్స్ అయ్యాకే స్పష్టం అవుతుంది.


Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


 


 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook