Allu Arjun Trivikram Shooting: అల్లు అర్జున్ తో షూట్ మొదలెట్టిన త్రివిక్రమ్!
Allu Arjun Trivikram begin shooting Ad Film in Hyderabad: త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్.. ఇంకా వీరి కాంబోకి టైం ఉందని అనుకుంటున్నారా? అయితే అది నిజమే. షూట్ ఈరోజే అంటే సోమవారం నాదే జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే
Allu Arjun Trivikram begin shooting Ad Film in Hyderabad: త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్.. అదేంటది ఇద్దరూ వేర్వేరు కాంబినేషన్ లో సినిమాలు చేస్తున్నారు కదా. ఇప్పుడు త్రివిక్రమ్ అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేయడం ఏమిటి అనుకుంటున్నారా? మీకు వచ్చిన డౌట్ కరెక్ట్ అలాగే మీరు విన్న వార్త కూడా కరెక్టే. అసలు విషయం ఏమిటంటే త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఒక యాడ్ ఫిలిం షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో యాడ్ ఫిలిం షూటింగ్ జరుగుతోంది. సుమారు రెండేళ్ల వ్యవధిలో అల్లు అర్జున్ రెండు యాడ్స్ త్రివిక్రమ్ డైరెక్షన్లో చేశారు.
ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం మేరకు హైదరాబాద్ లో జొమాటో యాడ్ షూటింగ్ జరుగుతోంది. గతంలో సుబ్బరాజుతో కలిసి అల్లు అర్జున్ చేసిన ఒక జొమాటో యాడ్ వివాదానికి కారణమైంది. తర్వాత క్రమంగా ఆ యాడ్ కనిపించడం మానేసింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పుడు త్రివిక్రమ్ ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో ఈ యాడ్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే ఆయన పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకుని మంచి ఫామ్ లో ఉన్నారు. కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ కోసం అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారు.
ఇంకా సినిమా షూటింగ్ మొదలవ లేదు కానీ ప్రస్తుతానికి సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ నెల నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే చివరిగా అల్లు అర్జున్తో అల వైకుంఠపురంలో సినిమాతో హిట్టు అందుకున్న త్రివిక్రమ్ తర్వాత భీమ్లా నాయక్ సినిమాకు దర్శకత్వం పర్యవేక్షణ వహించారు. ఆ తర్వాత సితార కన్స్ట్రక్షన్స్ లో వస్తున్న సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. అలాగే ఆయన మరోపక్క మహేష్ బాబుతో కూడా ఒక సినిమా చేస్తున్నారు.
మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది. అక్టోబర్ రెండో వారం నుంచి రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేష్ తల్లి ఇటీవల మరణించారు కాబట్టి షూటింగ్ వాయిదా పడుతుందా? లేక మహేష్ షూట్ కి హాజరవుతారా? అనే విషయం మీద మాత్రం కాస్త సందిగ్ధం నెలకొంది. మహేష్ సన్నిహిత వర్గాల ప్రకారం అయితే మహేష్ బాబు తన తల్లి దశదినకర్మ పూర్తయిన వెంటనే షూటింగ్లో పాల్గొనేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Warina Hussain Cute Photos: పద్దతిగా ముస్తాబైన బింబిసార ఐటెం గర్ల్.. క్యూట్ లుక్స్ లో పిచ్చెక్కిస్తున్న వరీనా హుసేన్!
Also Read: Alia Bhatt Baby Bump Photos: బేబీ బంప్ చూపిస్తూ ఆలియా ఫోజులు.. బ్లాక్ డ్రెస్ ఫోటోషూట్ చూశారా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook