Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులకు బెయిల్ మంజూరు..
Allu Arjun: సినీ నటుడు టాలీవుడ్ కథానాయకుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే సదరు నిందితులకు కోర్టు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన వారిలో ఆరుగురు నిందితులను గుర్తించిన సంగతి తెలిసిందే కదా.
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు వచ్చింది. నిన్న అల్లు అర్జున్ ఇంటిపై ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...వారిపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం వారిని జడ్జి దగ్గర హాజరుపర్చగా...వారికి బెయిల్ మంజూరు చేశారు.
నిన్న అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన ఆరుగురు అరెస్టు తెలిసిందే..బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే కదా.
కాసేపటి క్రితమే వనస్థలిపురంలోని కమలానగర్ లో జస్టిస్ ముందు ప్రవేశపెట్టారు. ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున రెండు ష్యూరిటీలు మూడు రోజులలో సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు నిబంధనలు ఉల్లంఘించి ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ పై పోలీసులు గుర్రుగా ఉన్నారు. అంతేకాదు అతని బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు రెడీ అవునట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు పోలీసుల పిటీషన్.. కోర్టులో చోటు చేసుకునే పరిణామాల పైన ఆసక్తి కొనసాగుతోంది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. మొత్తంగా ఇప్పటి వరకు ఓవరాల్ గా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ పై భారీ లాభాలను అందుకుంది. తెలుగులో కొన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాకపోయినా.. హిందీలో, కన్నడ, ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు బాక్సాఫీస్ దగ్గర రూ. 1600 కోట్ల వరకు రాబట్టి సంచలనం రేపుతోంది. అంతేకాదు ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 100 కోట్లకు పైగా థియేట్రికల్ గా లాభాలను తీసుకొచ్చింది.
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.