Eyy Bidda Idhi Naa Adda Telugu Promo: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప - ది రైజ్ ప్రమోషన్స్ లో వేగం పెరిగింది. నవంబర్ 19న 4వ సింగిల్ రిలీజ్ చేస్తామని ప్రకటించిన పుష్ప మూవీ యూనిట్.. తాజాగా ఆ పాటకు సంబంధించిన ప్రోమోలు విడుదల చేసింది. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా... అంటూ సాగే ఈ ఫోర్త్ సింగిల్ లిరికల్ సాంగ్ ప్రోమో చూస్తే.. ఇప్పటివరకు రిలీజైన మూడు పాటల్లాగే ఈ సాంగ్ కూడా మాస్ ఆడియెన్స్‌ని మాయ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా సాంగ్ ప్రోమో (Pushpa 4th Single promo) రిలీజైన గంట వ్యవధిలోనే ఈ వీడియోకు దాదాపు మిలియన్ వ్యూస్ మార్క్ టచ్ చేసే దిశగా పరుగులు తీసింది. ఫోర్త్ సింగిల్ ప్రోమోకే ఇంత భారీ రెస్పాన్స్ కనిపిస్తుందంటే.. సాంగ్ రిలీజ్ అయ్యాకా ఇంకెంత రెస్పాన్స్ ఉంటుందో అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. 



Also read : Cauliflower Teaser: క్యాలీఫ్లవర్ టీజర్.. శీలో రక్షతి రక్షితః


చంద్రబోస్ రాసిన ఈ పాటకు మ్యూజిక్ రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా.. నకాష్ అజీజ్ పాట పాడాడు. అల్లు అర్జున్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మంధన జంటగా నటిస్తుండగా మళయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక, సెకండ్ సింగిల్ శ్రీవళ్లి సాంగ్, థర్డ్ సింగిల్ సామి సామి పాటలు (Pushpa songs Telugu) మ్యూజిక్ లవర్స్‌ని మాస్ ఆడియెన్స్‌ని అలరిస్తున్నాయి. 


ఇక పుష్ప మూవీ నుంచి ఫోర్త్ సింగిల్ సాంగ్ (4th Single from Pushpa) మొత్తం ఎలా ఉంటుందో తెలియాలంటే నవంబర్ 19న ఉదయం 11.07 గంటల వరకు వేచిచూడాల్సిందే.


Also read : Nora Fatehi Photo shoot: ట్రెడిషనల్ డ్రెస్‌లో సైతం సెక్సీగా నోరా ఫతేహీ, వైరల్ అవుతున్న ఫోటోలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook