Pushpa inspired for Ads : పుష్ప రాజ్‌ను వాడేసుకుంటున్నారు.. కేంద్రం కూడా వదిలిపెట్టలేదు
Pushpa Movie inspired for sevaral Ads : నెట్టింట్లో అంతా ఇప్పుడు పుష్ప హవానే నడుస్తోంది... కేంద్రం కూడా కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అల్లు అర్జున్ పుష్ప క్యారెక్టర్‌నే ఎంచుకుంంది.
Ads on Pushpa movie : పాన్ ఇండియా మూవీగా వచ్చిన అల్లు అర్జున్ పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు పలు యాడ్స్, కార్టూన్స్‌కు ఇన్సిపిరేషన్‌గా నిలిచింది. పాల్ప ఉత్పత్తులను విక్రయించే సంస్థ అమూల్.. పుష్ప (pushpa) అమూల్ కార్టూన్‌ని ఇటీవల పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. పుష్ప సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచిన పోస్టర్ల ఆధారంగా కార్టూన్ రూపొందించింది.
ఎర్రచందనం దుంగలపై పుష్ప కూర్చునే ఈ కార్టూన్‌లో... పుష్ప చేతిలో బ్రెడ్‌పై బటర్ ఉండే విధంగా తీర్చిదిద్దారు. అలాగే శ్రీవల్లి సామీ సామీ సాంగ్ స్టెప్ పోస్టర్‌లో ఒక చేతిలో బటర్ రాసిన బ్రెడ్, మరో చేతిలో బటర్ రాసిన కత్తితో కార్టూన్‌ను రిలీజ్ చేసింది అమూల్. (Amul) పుష్‌ప్యాక్ ది స్లైస్.... హేవ్ సమ్ అమూల్, అర్జున్ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో (Social media) పోస్ట్ చేసింది అమూలు సంస్థ.
ఇలా ప్రస్తుతం నెట్టింట్లో అంతా పుష్ప హవానే నడుస్తోంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అల్లు అర్జున్ మీమ్ (Allu Arjun Meem) ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తగ్గేదేలే డైలాగ్ చెప్పే స్టిల్‌ను కాస్త ఎడిట్ చేసి హీరోకి మాస్క్ పెట్టారు. ఈ ఫోటోపై పుష్ప మూవీలోని తగ్గేదేలే డైలాగ్‌తో ఒక మీమ్‌ను క్రియేట్ చేసింది. డెల్టా అయినా ఒమిక్రాన్ అయినా మాస్క్ తీసేదే లే అనే క్యాప్షన్‌తో ఈ పోస్టు చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఇక పుష్ప.. పుష్పరాజ్.. ఎవరైనా సరే.. కరోనాపై (Corona) మన పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయాలను ఎప్పటికీ మర్చిపోవదంటూ ఈ పోస్ట్‌కు జత చేశారు. అలాగే ఎప్పుడూ మాస్క్ (Mask) ధరించండి.. తరచూ చేతులను శానిటైజర్‌తో శుభ్రపర్చుకోండి... సోషల్ డిస్టెన్స్ పాటించండి.. తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోండి అంటూ ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ పోస్ట్‌ను అల్లుఅర్జున్, రష్మికలకు కూడా ట్యాగ్ చేశారు.
Also Read : సమంత బాటలోనే.. మెగా డాటర్! విడాకులు కన్ఫర్మ్.. ప్రూఫ్ ఇదిగో!!
ఇలా ఇప్పుడు పుష్పకు సంబంధించిన పలు పోస్ట్‌లు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. పుష్పలో హీరో ఎర్ర చందనం స్మగ్లర్ అయినా, ఇప్పుడు మాత్రం ఆ క్యారెక్టర్ పాపులారిటీ పలు మంచి విషయాలకు ఉపయోగపడుతోంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : TS Fever Survey: తెలంగాణలో రేపటి నుంచి ఫీవర్ సర్వే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook