Alpha: ఆలియా కు ధీటుగా లేడీ స్పైగా శార్వరి.. ఆ హీరోలకు ధీటుగా..
Alpha: బాలీవుడ్ లో యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ పేరిట గూఢచారి సినిమాలను నిర్మిస్తోంది. ఈ కోవలో ఇపుడు లేడీ స్పై నేపథ్యంలో ‘ఆల్ఫా’ అనే సినిమా తెరకెక్కిస్తుంది. ఈ సినిమాలో ఆలియా, శార్వరి లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు.
Alpha: రెయిజింగ్ స్టార్ శార్వరి తన కెరీర్ బెస్ట్ మూవీ ‘ఆల్పా’ మూవీ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో ఆలియా భట్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే కదా. యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్ భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆలియా భట్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. తాజాగా ఈ సినిమాలో సెకండ్ లీడ్ రోల్ ప్లే చేస్తోన్న శార్వరి ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ సినిమా కోసం ఆలియాతో పాటు శార్వరి ప్రత్యేకంగా ట్రెయిన్ అవుతున్నారు.
ఈ సందర్భంగా ‘ఆల్ఫా’ మూవీ కోసం ఎలా రెడీ అవుతున్న విషయాన్ని తన ఫ్యాన్స్ కు ప్రజలకు మోటివేట్ చేసేలా శార్వరి పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ సినిమా కోసం తను ఎలా ప్రిపేర్ అవుతున్న విషయాన్ని చెప్పింది. ఈ సినిమాను ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన శివ్ రవైల్ డైరెక్ట్ చేస్తున్నారు.
యశ్ రాజ్ ఫిల్మ్స్ లో ఫస్ట్ ఉమెన్ లీడ్ లో తెరకెక్కుతోన్న స్పై యూనివర్స్ మూవీగా ‘ఆల్ఫా’ను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆలియా సూపర్ ఏజెంట్ పాత్రలో నటిస్తోంది.యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే ‘ఏక్ థా టైగర్’, టైగర్ జిందా హై’, వార్, పఠాన్, టైగర్ 3 వంటి స్పై సినిమాను ప్రొడ్యూసర్ చేసారు. ప్రస్తుతం యశ్ రాజ్ ఫిల్మ్స్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లతో ‘వార్ 2’ మూవీని తెరకెక్కిస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ప్రథమార్ధంలో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ కోవలో ‘ఆల్ఫా’ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రెస్టీజియస్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్.
Also Read: Hyderabad T Square: న్యూయార్క్‌ను తలదన్నేలా హైదరాబాద్‌లో భారీ నిర్మాణం.. ప్రపంచస్థాయిలో టీ స్క్వేర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి