Hyderabad T Square: న్యూయార్క్‌ను తలదన్నేలా హైదరాబాద్‌లో భారీ నిర్మాణం.. ప్రపంచస్థాయిలో టీ స్క్వేర్

T Square At Knowledge City Raidurgam Of Hyderabad: అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో మరో అద్భుత నిర్మాణం కాబోతున్నది. న్యూయార్క్‌ టైమ్‌ స్వ్కేర్‌ లాంటి నిర్మాణం మన నగరంలో సిద్ధం కాబోతున్నది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 12, 2024, 05:20 PM IST
Hyderabad T Square: న్యూయార్క్‌ను తలదన్నేలా హైదరాబాద్‌లో భారీ నిర్మాణం.. ప్రపంచస్థాయిలో టీ స్క్వేర్

Hyderabad T Square: అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ తళుకులీనుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్న మహానగరంలో మరో భారీ నిర్మాణం అందుబాటులోకి రాబోతున్నది. న్యూయార్క్‌ను తలదన్నే రీతిలో హైదరాబాద్‌ భారీ నిర్మాణం సిద్ధం కాబోతున్నది. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌ లాంటి నిర్మాణం హైదరాబాద్‌లో టీ స్వ్కేర్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: Kavitha Bail: ఫలించని కేటీఆర్‌, హరీశ్ రావు ప్రయత్నాలు.. ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్‌

 

తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, రాయదుర్గం, నానక్‌రామ్‌గూడ వంటి ప్రాంతాల్లో ఆకాశ హర్మ్యాలు సిద్ధమవుతున్నాయి. విదేశాల్లో ఉన్నామా అనే రీతిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి న్యూయార్క్‌ నగరంలో ప్రఖ్యాతి పొందిన టైమ్‌ స్క్వేర్‌ లాంటి నిర్మాణం హైదరాబాద్‌లో నిర్మాణం కాబోతున్నది. 

Also Read: TGRTC: ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్.. వచ్చే నెల నుంచి సిటీ బస్సుల్లో..

 

హైదరాబాద్‌ రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సిటీ సమీపంలో భారీ ప్లాజా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పరిశ్రమలు మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో టీ స్వ్కేర్‌ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలోనే టీజీఐఐసీ టెండర్లు ఆహ్వానించింది. మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండడంతోపాటు స్థానికులకు ఆహ్లాదం కలిగించేలా టీ స్వ్కేర్‌ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. టీ స్వ్కేర్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఈవెంట్లు నిర్వహించడంతోపాటు నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే టెండర్లు ఖరారై టీ స్వ్కేర్‌ నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే టీ స్క్వేర్‌ పూర్తయితే హైదరాబాద్‌కు అది మరో కలికితురాయిగా మారనుంది.

బీఆర్‌ఎస్‌ హయాంలోనే ప్రణాళిక
అయితే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే నాలెడ్జ్‌ సిటీ, రాయదుర్గం ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ నిర్మాణం చేపట్టాలని ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గత ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. హైదరాబాద్‌ అభివృద్ధి చెరగని ముద్ర వేసిన కేటీఆర్‌ ఆలోచనలో నుంచే టీ స్వ్కేర్‌ వచ్చిందని తెలుస్తోంది. గతంలో కేటీఆర్‌, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ బృందం టీ స్వ్కేర్‌ లాంటి నిర్మాణంపై చర్యలు తీసుకున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గం చెబుతోంది. గత ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగించడంపై బీఆర్‌ఎస్‌ వర్గం ఆహ్వానిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News