Agent Movie Trolls : ఏజెంట్ నాకు నచ్చింది.. నెక్ట్స్ అదిరిపోతుంది.. అమల పోస్ట్ వైరల్
Amala Akkineni on Agent Trolls అమల తాజాగా తన కొడుకు అఖిల్ కొత్త సినిమా మీద స్పందించింది. ఏజెంట్ మూవీ మీద వస్తోన్న ట్రోల్స్‌పై అమల రియాక్ట్ అయింది. హాల్ అంతా నిండింది.. అమ్మ, అక్కా, చెల్లెళ్లు ఇలా ఫ్యామిలీ అంతా కలిసి సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది.
Amala Akkineni on Agent Trolls ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు ఎలా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ మాత్రం తేడా కొట్టేసిన ట్రోలింగ్‌తో ఆడేసుకుంటున్నారు. ఓ వర్గం పనిగట్టుకుని మరీ ట్రోలింగ్ చేస్తుంటుంది. సినిమా అటూ ఇటూ అయినా కూడా ట్రోలింగ్‌కు గురవ్వడం ఖాయం. దానికి పెద్ద స్టార్లు కూడా మినహాయింపేమీ కాదు. ఇంకా బడా స్టార్ల మీదే ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు అఖిల్ ఏజెంట్ సినిమా మీద ట్రోలింగ్ జరుగుతోంది.
ఇప్పుడు అఖిల్ ఏజెంట్ సినిమా మీద జరుగుతున్న ప్రచారం మీద అమల స్పందించింది. ఇన్‌సెక్యూరిటీస్ వల్లే ఇలాంటి నెగెటివ్ ట్రోలింగ్ వస్తుంటుంది.. అవి కూడా విజయానికి దోహదపడతాయి.. నిన్న ఏజెంట్ మూవీని చూశాను.నిజంగానే నేను ఎంజాయ్ చేశాను.. దాంట్లోనూ కొన్ని తప్పులున్నాయి.. ఓపెన్ మైండ్‌తో సినిమాను చూస్తే కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు..
నేను వెళ్లిన హాల్ మొత్తం నిండింది.. లేడీస్, తల్లులు, గ్రాండ్ మదర్స్ ఇలా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.. యాక్షన్ సీక్వెన్స్ వచ్చినప్పుడు ఎంతగానో ఎంజాయ్ చేశారు.. ఇక నెక్ట్స్ సినిమా మరింత పెద్దగా, బెటర్‌గా ఉండబోతోందని కచ్చితంగా చెబుతున్నాను అని అంటూ అమల చెప్పుకొచ్చింది.
Also Read: Kriti Sanon Sita Posters : అశోకవనంలో సీత.. ఆదిపురుష్ నుంచి కృతి సనన్ లుక్.. పిక్స్ వైరల్
అఖిల్ ఏజెంట్ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద గట్టెక్కేందుకు కష్టపడుతోంది. మొదటి రోజు పది కోట్ల గ్రాస్ లోపే ఉంది. ఐదు కోట్ల షేర్ లోపు ఉంది. దీంతో అఖిల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు దగ్గరగా అయినా వెళ్తాడా? లేదా? అన్న అనుమానం ట్రేడ్ వర్గాల్లో ఏర్పడుతోంది. వీకెండ్ అయ్యే వరకు కనీసం యాభై శాతం అయినా రికవరీ చేస్తుందా? లేదా? అన్నది చూడాలి. ఇక అఖిల్ నెక్ట్స్ సినిమా ఎలా ఉంటుందని అక్కినేని అభిమానులు అనుకుంటున్నారు. అయితే ఇలాంటి యాక్షన్ సినిమాలు కాకుండా..లవ్ స్టోరీలు చేస్తేనే బెటర్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
Also Read: Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook