Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?

Rajinikanth About Balakrishna రజినీకాంత్ తాజాగా బాలయ్య గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో రజినీకాంత్‌ చేసిన కామెంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బాలయ్య చేసే ఫీట్ల గురించి కామెంట్ చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2023, 10:12 AM IST
  • ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు
  • నెట్టింట్లో రజినీకాంత్ స్పీచ్ వైరల్
  • బాలయ్యను పొగిడాడా? ట్రోల్ చేశాడా?
Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?

Rajinikanth About Balakrishna ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు టీడీపీ తరుపున గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. చంద్రబాబు, బాలయ్యలు ఈ వేడుకలను దగ్గరుండి జరిపిస్తున్నారు. అయితే రజినీకాంత్ ఈ వేడుకల్లో సందడి చేశాడు. ఎన్టీఆర్, బాలయ్య, చంద్రబాబులతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. దీంతో రాజకీయాల మీద కూడా రజినీకాంత్ మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు రజినీకాంత్ మాటలు రాజకీయంగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

రాజకీయంగా రజినీకాంత్ మాట్లాడిన మాటలను పక్కన పెడితే.. బాలయ్య మీద చేసిన కామెంట్లు వింటే.. ట్రోల్ చేశాడా? పొగిడాడా? అన్నది అర్థం కావడం లేదంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. కంటి చూపుతో చంపేస్తాడు.. ఒక్క తన్ను తంతే జీపు అంత దూరం ఎగిరి పడుతుంది అంటూ బాలయ్య ఫీట్ల గురించి రజినీకాంత్ చెప్పుకొచ్చాడు.

అది బాలయ్య కాబట్టి జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారని, తాను చేసినా, అమితాబ్ చేసినా, షారుఖ్‌ సల్మాన్ ఇలా ఎవ్వరూ చేసినా కూడా జనాలు అంగీకరించరు.. బాలయ్య కాబట్టే జనాలు అంగీకరిస్తారు.. ఎందుకంటే బాలయ్యను జనాలు బాలయ్యలా చూడటం లేదు.. ఆ యుగపరుషుడు ఎన్టీఆర్‌లానే చూస్తున్నారు.. యుగ పురుషుడు అంటే ఏమైనా చేయగలడు కదా? అని రజినీకాంత్ చెప్పుకొచ్చాడు.

Also Read: Kriti Sanon Sita Posters : అశోకవనంలో సీత.. ఆదిపురుష్ నుంచి కృతి సనన్ లుక్.. పిక్స్ వైరల్

చంద్రబాబు రానున్న ఇరవై ఏళ్లకు ప్లానింగ్ వేస్తున్నాడని, అది కానీ నిజం అయితే ఇండియాలో ఏపీ ఎక్కడో ఉంటుందని అన్నాడు. తాను ఈ మధ్య హైద్రాబాద్‌కు వస్తే.. హైద్రాబాద్‌లో ఉన్నానా? న్యూ యార్క్‌లో ఉన్నానా? అని అనుమానం వచ్చిందంటూ రజినీకాంత్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు గురించి పాజిటివ్‌గా మాట్లాడటంతో వైసీపీ వర్గం రజినీపై గుర్రుగా ఉన్నట్టు కనిపిస్తోంది.

Also Read:  Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x