Amaravathiki Atu Itu Title for Mahesh Babu 28: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి సర్కారు వారి పాట సినిమా పూర్తవుగానే మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తాడు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ప్రారంభం కావడానికి చాలా కాలమే పట్టింది. ప్రారంభోత్సవం జరిగిన తర్వాత కూడా సినిమా షూటింగ్ విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుగా మహేష్ బాబు తల్లి మరణించడం, తర్వాత మహేష్ బాబు తండ్రి కృష్ణ మరణించడంతో సినిమా కొన్నాళ్లపాటు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుపుతున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమాకి సంబంధించిన నైట్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. సినిమాలో ముఖ్యంగా భావిస్తున్న ఒక నైట్ సీక్వెన్స్ మొత్తాన్ని ప్రస్తుతానికి హైదరాబాద్ శివారులలో వికారాబాద్ దగ్గరలోని శంకర్పల్లి అనే గ్రామంలో ఏర్పాటు చేసిన స్పెషల్ హౌస్ సెట్ లో షూటింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.


అయితే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాకి అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అమ్మ చెప్పింది, అమ్మ కథ ఇలా రకరకాల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు అమరావతికి అటు ఇటు అనే పేరు పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి గత మూడున్నర నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు తెలుగు వారందరూ ఎక్కువగా చర్చిస్తున్న పేరుగా అమరావతి మారిపోయింది. ఎందుకంటే గతంలో 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు.


కానీ 2019 ఎన్నికల్లో గెలిచిన వైఎస్ జగన్ అమరావతి ఒక్కటే రాజధాని కాదని మూడు రాజధానులు చేస్తున్నామని అమరావతి కేవలం శాసన రాజధానిగా ఉంటుందని ప్రకటించడం కలకలం రేపింది. ప్రస్తుతానికి ఈ అంశం కోర్టులో ఉంది కాబట్టి ఎవరు దీని గురించి ఎక్కువగా ప్రస్తావించడం లేదు. కానీ ఇలాంటి వివాదాస్పద వ్యవహారం ఉన్న ప్రాంతానికి చెందిన పేరును తమ సినిమాకు టైటిల్ గా త్రివిక్రమ్ ఎందుకు పెట్టారు? అనేది చర్చ జరుగుతుంది. అంటే ఆంధ్ర రాజధానిగా అమరావతిని త్రివిక్రమ్ సమర్థిస్తున్నాడా? లేక ఆయన ఉద్దేశం ఏమిటి? అమరావతి టైటిల్ ని ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి?అనే అంశం మీద చర్చ జరుగుతోంది.


Also Read: Dasara Sensor Cuts: తెలుగు చరిత్రలోనే అత్యదిక సెన్సార్ కట్స్.. 'దసరా'కు ఏమేం కట్స్ చెప్పారంటే?


Also Read: Samantha about Arha: అల్లు అర్హకు ఇంగ్లీష్ రాదు.. ఎంతో గొప్పగా పెంచుతున్నారు.. బన్నీ పెంపకంపై సమంత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook