Rashmi Gautam amberpet stray dog Controversy అంబర్‌పేట్‌లో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు, ఆ విజువల్స్‌ను చూసి ప్రతీ ఒక్కరూ కదిలిపోయారు. ఆ దృశ్యాలను చూసి చలించిపోయారు. కుక్కలన్నీ కూడా అలా పీక్కుతింటూ ఉండటం చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే. అయితే ఈ ఘటన మీద సమాజం మొత్తం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ పాపం ఎవరిది? అంటూ సమాజాన్ని నిలదీశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీధి కుక్కలను అరికట్టలేని ప్రభుత్వానిదా? కుక్కలు అలా చెలరేగిపోతోన్నా.. ఏమీ చేయకుండా అలా నిల్చున్న సమాజానిదా? అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అయితే వీటిపై రకరకాల చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఇక పెట్ లవర్‌గా యాంకర్ రష్మీ ఈ ఘటన మీద వింతగా స్పందించింది.


ఈ పాపం ఎవరిది? అంటూ ఓ నెటిజన్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశాడు. అయితే దీనిపై రష్మీ స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చనిపోయిన బాలుడి గురించి పట్టించుకోకుండా.. ఆ కుక్కలను పునరావాస కేంద్రాలకు పంపించాలి.. వాటికంటూ ఓ గూడును ఏర్పాటు చేయాలని చెప్పింది. దీంతో జనాలు రష్మీ మీద పడిపోయారు. దారుణంగా తిట్టేస్తున్నారు.


 



నీ ఇంట్లోనూ ఇలాంటివి జరిగితే.. నీ కుటుంబ సభ్యులకే ఇలాంటివి జరిగితే అప్పుడు నీకు ఆ బాధ తెలుస్తుంది అని రష్మీని తిట్టేస్తున్నారు. అయితే రష్మీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ భూమి ఒక్క మనుషులకే చెందిందని మీరు భావిస్తున్నారా? ఈ భూమ్మీద ప్రతీ ఒక్క ప్రాణికి బతికే హక్కు, స్వేచ్చ ఉందని రష్మీ చెప్పుకొచ్చింది.


 



కుక్కల కోసం ప్రత్యేకంగా షెల్టర్ ఏర్పాటు చేయాలని రష్మీ చెప్పడంతో ఓ నెటిజన్ ఇలా అన్నాడు. అయితే మీరే ప్రభుత్వాన్ని గట్టిగా అడగండి.. మీరు సెలెబ్రిటీలు కాబట్టి మీ మాటకు విలువ ఉంటుందని అన్నాడు. నేను ఒక్క దాన్ని ఏం చేయలేను.. నన్ను ట్రోల్ చేయడంలో పెట్టే శ్రద్ద ప్రభుత్వాన్ని అడగడంలో చూపించండి.. అందరం కలిసి ప్రయత్నించాలి అంటూ రష్మీ చెప్పుకొచ్చింది.


Also Read:  Sonu Nigam Attack Video : స్టార్ సింగర్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి.. ఈవెంట్‌లో గొడవ.. వీడియో వైరల్


Also Read: Prabhu Hospitalized : హాస్పిటల్‌లో చేరిన ప్రముఖ నటుడు ప్రభు.. కారణం ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook