Vettaiyan: సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు గురి కాగా.. హుటాహుటిన ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని హాస్పిటల్ కి తరలించినట్లు నిన్న రాత్రి మొత్తం వార్తలు వినిపించాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ నిన్న రాత్రి.. సమయంలో చెన్నైలోనే అపోలో హాస్పిటల్లో చేరారు. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చెందుతుండగా.. ఆయన సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు విషయంలోకెళితే రజినీకాంత్ తీవ్రమైన కడుపు నొప్పితో పాటు రెగ్యులర్ చెకప్ లో భాగంగానే.. హాస్పిటల్ కి వెళ్ళాలని.. ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టుగా.. ఈ చెకప్ కోసమే హాస్పిటల్లో చేరినట్లు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారట. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం రజనీకాంత్ చెకప్ పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వస్తారని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే దీనిపై రజినీకాంత్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ విషయం పక్కన పెరిగితే ప్రస్తుతం అక్టోబర్ 10న విడుదల కానున్న రజినీకాంత్ సినిమా…వెట్టాయ‌న్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. రజనీ అభిమానులను మరింత నిరాశకి గురిచేస్తోంది. 


అదేమిటంటే ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో సక్సెస్ అవ్వాలి అంటే.. అన్ని భాషలలోనూ ఒక సినిమాని ప్రమోట్ చేయాలి. కానీ వెట్టాయ‌న్ సినిమా తమిళంలో తప్ప వేరే ఏ భాషల్లోనూ పెద్దగా.. సౌండ్ క్రియేట్ చేయాలేకుంది. అందుకు ముఖ్య కారణం ఈ సినిమా ప్రమోషన్స్. రజినీకాంత్ ఇతర భాషల్లో ఇంటర్వ్యూలు ఇస్తే తప్పకుండా ఈ చిత్రానికి.. అన్ని భాషలలో క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. కానీ రజనీకాంత్ తన గత చిత్రాల లాగానే ఈ సినిమాకి కూడా తాను వచ్చి వేరే భాషల్లో ప్రమోషన్ చేయలేనని చెప్పేసారట. దీంతో ఇతర భాషలలో ఈ సినిమా రిజల్ట్.. గురించి అందరిలో ఆందోళన మొదలైంది. కనీసం తమిళంలోని ఈ చిత్రం పేరుని కూడా మార్చకుండా మిగతా భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం కనీసం తెలుగులో మినిమం రన్ అయినా.. సొంతం చేసుకుంటుందా లేదా అనేది ఎంతో మంది సందేహం.


వేట్టయాన్ సినిమా విషయానికి వస్తే , ప్రముఖ డైరెక్టర్ టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక రజినీ చేస్తూ ఉన్న మరొక సినిమా కూలీ. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కూడా  కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.. వేట్టయాన్ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన విడుదల కాబోతుండగా ,ఈ సినిమా కోసం తమిళ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


Read more: Tirumala Laddu Row: పవన్ అసలైన సెక్యులర్.. లడ్డు వివాదం వేళ సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.