Amigos Movie 3 Days Collections: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమా రిలీజ్ అయి ఇప్పటికి మూడు రోజుల పూర్తి థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. రాజేంద్రనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కళ్యాణ్ రామ్ కెరియర్ లోని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మొట్టమొదటిసారి మూడు పాత్రల్లో కనిపించాడు. మూడు విభిన్నమైన పాత్రలు కావడంతో ఆయనకు నటించే స్కోప్ ఎక్కువగా దక్కింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలిస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా మొదటి రోజు రెండు కోట్ల మూడు లక్షలు వసూలు చేస్తే రెండవ రోజు కోటి 11 లక్షలు, మూడవ రోజు కోటి 21 లక్షలు వసూలు చేసింది. అలా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం నాలుగు కోట్ల 35 లక్షల షేర్, ఏడు కోట్ల 15 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా నైజాం ప్రాంతంలో మూడవరోజు 29 లక్షల వసూలు చేయగా సీడెడ్ లో 26 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 18 లక్షలు వసూలు చేసింది.


ఈస్ట్ గోదావరి జిల్లాలో 12 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో ఏడు లక్షలు వసూలు చేసిన ఈ సినిమా గుంటూరు జిల్లాలో 10 లక్షలు, కృష్ణా జిల్లాలో 12 లక్షలు, నెల్లూరు జిల్లాలో ఏడు లక్షలు వసూలు చేసి కోటి ఇరవై ఒక్క లక్షల షేర్ కోటి 90 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా మూడు రోజులకు గాను కర్ణాటక సహా మిగతా భారత దేశంలో 30 లక్షల షేర్ వసూలు చేస్తే ఓవర్సీస్ లో 60 లక్షల షేర్ వసూళ్లు చేసింది.


ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఐదు కోట్ల 25 లక్షల షేర్ తొమ్మిది కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా 11 కోట్ల 30 లక్షల బిజినెస్ జరుపుకోవడంతో 12 కోట్లకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించారు. ఇప్పటికే ఈ సినిమా ఐదు కోట్ల 25 లక్షలు వసూలు చేయడంతో ఇంకా ఆరు కోట్ల 75 లక్షలు వసూలు చేస్తే సినిమా హిట్గా నిలుస్తుంది అని అంటున్నారు.
Also Read: SSMB 28: మహేష్ కోసం స్ట్రాంగ్ విలన్ ను సెట్ చేసిన త్రివిక్రమ్.. హ్యాట్రిక్కే!


Also Read: Prabhas Hit Formula: హిట్ ఫార్ములానే నమ్ముకున్న ప్రభాస్.. సలార్ ప్లానింగ్ అలా!