Thala Movie Teaser: ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలింస్‌పై ఎన్‌వీ ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్ నిర్మిచిన మూవీ "తల". అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆయన అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. త్వరలోనే గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. తమన శరీరానికి తల ఎంత ముఖ్యమో.. తనకు ఈ తల మూవీ అంతే ఇంపార్టెంట్ అని చెప్పారు. తన కెరీర్‌లో ఆర్బీ చౌదిరిని దేవుడిగా భావిస్తానని.. ఆయన నిర్మాణంలో తన కొడుకును హీరోగా పరిచయం చేస్తుండడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయన తనకు డ్యాన్స్‌ మాస్టర్‌గా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారని.. తనకు ఆయన సినిమాలతోనే మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయని.. త్వరలోనే గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Alleti Maheshwar Reddy: ఇవి విజయోత్సవం కాదు రేవంత్‌ రెడ్డి వంచనోత్సవాలు జరపాలి


అనంతరం నటుడు రోహిత్ మాట్లాడుతూ.. ఈ సినిమా తన పాత్ర గురించి అమ్మ రాజశేఖర్ చెప్పగానే చాలా నచ్చిందని.. తనకు కామెడీ ఇష్టమన్నారు. ఈ మూవీలో కామెడీతో పాటు మంచి ఎమోషన్ ఉంటుందన్నారు. అమ్మ రాగిన్ రాజ్‌కు ఈ చిత్రంతో మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. నటి ఎస్తేర్ మాట్లాడుతూ.. తనకు మూవీలో నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చిందన్నారు. తాను ఇప్పటివరకు చేసిన చిత్రాల కంటే ఇందులో చాలా డిఫరెంట్‌గా ఉంటుంన్నారు. సినిమా మంచి విజయం సాధిస్తుందని.. ప్రేక్షకులు థియేటర్‌లో ఎంజాయ్ చేసేలాఆ ఉంటుందన్నారు. 


హీరో అమ్మ రాగిన్ రాజ్ మాట్లాడుతూ.. తాను హీరోగా మారినప్పటి నుంచే ప్రేక్షకులు ఎలా కోరుకుంటారో అలా ఉంటానని అన్నారు. నాన్న ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు తన పాత్ర ఎలా ఉంటుందోనని ఊహించుకున్నానని.. ఆ పాత్రలో ఉండిపోయేవాడినని చెప్పారు. తల సినిమా ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా ఉంటుందన్నారు. ముక్కు అవినాష్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రావణ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.


సాంకేతిక బృందం:


==> సౌండ్ డిజైన్ - సతీష్
==> ఆర్ట్ డైరెక్టర్ - రామకృష్ణ
==> యాక్షన్ కొరియోగ్రఫీ - స్టంట్ కెవిన్, స్టంట్ సిల్వ, మల్లి
==> ఎడిటర్ - శివ  శర్వాణి 
==> DOP - శ్యామ్ కె నాయుడు
==> సంగీతం - థమన్.ఎస్, అస్లాం కేయి, ధర్మ తేజ
==> PRO- సురేష్ కొండేటి
==> సమర్పణ - ఆర్బీ చౌదరి
==> నిర్మాతలు - ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్
==> కథ, మాటలు, కొరియోగ్రఫీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - అమ్మ రాజశేఖర్.


Also Read: Tirumala: తిరుమలలో మళ్లీ ఘోర అపచారం.. మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన షాకింగ్ ఘటన.. ఏంజరిగిందంటే..?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter