Tirupati Temple:తిరుమల శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. అలాంటి తిరుపతిలో గతంలో జరిగిన ఘటన ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. దీంతో హిందు సంఘాలు దీనిపై మండిపడుతున్నాయి.
తిరుమల శ్రీవారిని భక్తులు నిండు మనసుతో కొలుచుకుంటారు. స్వామి వారి కొసం కొన్ని వందల కిలో మీటర్ల నుంచి వస్తుంటారు.పదుల సంఖ్యలో కంపార్ట్ మెంట్ లలో గంటల పాటు వెయిట్ చేస్తుంటారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతంతిరుమలలో కొత్తగా టీటీడీ బోర్డుసైతం ఏర్పడింది. ఈ క్రమంలో తిరుమలలో అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తొంది. అయితే.. తిరుమలలో కొన్ని ఏళ్ల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా బైటికొచ్చినట్లు తెలుస్తొంది.
2021లో తిరుమల శ్రీవారి ఆలయంలోని రాములవారి ఉత్సవ విగ్రహం వేలు విరిగిపోయింది. అయితే అప్పటి టీటీడీ సిబ్బంది.. ఎవరు పట్టించుకోలేదు. ఈ ఘటన ఇటీవల బైటికొచ్చింది. అధికారులు, పండితులు మరమ్మత్తులు చేయించి పూజలు చేయించారు.
స్వామి వారి విగ్రహంవేలు విరిగిపోతే.. ఇన్నిఏళ్లపాటు పట్టించుకోరా.. అంటూ భక్తులు మండిపడుతున్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకొవాలని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనతో తిరుమల అంశంపై మళ్లీ వివాదం రాజుకుందని చెప్పుకొవచ్చు.
ఇదిలా ఉండగా.. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యలు చేపట్టారు.టీటీడీలో హిందువులు మాత్రమే ఉండాలన్నారు అంతే కాకుండా.. తిరుమలలో అన్యమత ప్రచారంవంటికి జరిగితే వదిలేదిలేదన్నారు.తిరుమలలో భక్తులకు ఎలాంటి లోటులేకుండా టీటీడీ చర్యలు చేపట్టినట్లు తెలుస్తొంది.