Anand Deverakonda Baby Third Single ఆనంద్ దేవరకొండ హీరోగా పెద్ద సక్సెస్‌లు ఏమీ చూడలేదు. హీరోగా, నటుడిగా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. విజయ్ దేవరకొండ వంటి వాడే సరైన హిట్ కోసం ఇప్పుడు పరితపిస్తున్నాడు. అయితే ఆనంద్ నుంచి జనాలు కూడా అంతగా ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్, హైవే సినిమాలు మరీ అంతగా గుర్తింపును అయితే తీసుకురాలేదు. సరైన సక్సెస్ కోసం ఆనంద్ ఇంకా కష్టపడుతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథాబలం ఉన్న సినిమాలు ఎంచుకుంటూ వస్తున్న ఆనంద్.. ప్రేమ కథా చిత్రంతో అలరించనున్నాడు. బేబీ అంటూ వైష్ణవి చైతన్యతో ఆనంద్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు కథ, కథనం సాయి రాజేష్ అందిస్తుండగా.. ఎస్‌కేఎన్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో పాటను కూడా రిలీజ్ చేశారు. రష్మిక మందాన్న చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేయించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఆనంద్ దేవరకొండను అభిమానులు ఆడుకున్నారు.


ఆనంద్ మైక్ అందుకుని మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ మాట్లాడనివ్వలేదు. అవతల ఉన్న ఆడియెన్స్ నానా హంగామా చేశారు. మాట్లాడమని అరుస్తున్నారా? మాట్లాడొద్దు అని అరుస్తున్నారా? అన్నది ఎవ్వరికీ అర్థం కాలేదు. చివరకు ఆనంద్ దేవరకొండకి కూడా డౌట్ వచ్చింది. మీరు ఎందుకు ఇలా అరుస్తున్నారు.. ట్రోలింగ్ చేసినట్టుగా ఉందిరా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసి.. ఇక్కడా ట్రోలింగ్ చేస్తున్నారా? అని అన్నాడు. ఇంకా నేనేం పీకలేదురా అని చెప్పుకొచ్చాడు.


Also Read:  Akhil Agent OTT : ఈ వారం ఓటీటీ థియేటర్ మూవీలు.. ఓటీటీలో అయినా అఖిల్ ఓకే అనిపిస్తాడా?


ఇక రష్మికను ఆనంద్ ముద్దుగా రషి అని పిలవడంతో ఆడియెన్స్ హంగామా చేశారు. రషితో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని, అందుకే అలా పిలుస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తన అన్న విజయ్ ఎక్కడ అని ఆడియెన్స్ గోల చేస్తుంటే.. రాజమండ్రిలో ఉన్నాడని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి ఆనంద్‌ను మాత్రం ఆడియెన్స్ బాగానే ఆడుకున్నట్టుగా కనిపిస్తోంది.


Also Read:  Naresh Pavitra Kiss : రెచ్చిపోయిన జంట.. షోలో నరేష్ పవిత్రల ముద్దులు.. బంధం మీద క్లారిటీ వచ్చేసినట్టే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook