Anand Deverakonda: క్రైమ్ థ్రిల్లర్ గా ఆనంద్ దేవరకొండ మూవీ..ఆకట్టుకుంటున్న `హైవే` కాన్సెప్ట్ పోస్టర్స్..
Anand Deverakonda: ఇటీవల పుష్పక విమానం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో సైకో క్రైమ్ థ్రిల్లర్ ‘హైవే’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి కాన్సెప్ట్ పోస్టర్స్ రిలీజ్ చేసింది చిత్రబృందం.
Anand Deverakonda Highway Movie: టాలీవుడ్ యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) తాజాగా నటిస్తున్న చిత్రం 'హైవే'(Highway Movie). ఈ సినిమాకు కేవీ గుహన్(KV Guhan) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సైకో క్రైమ్ థ్రిల్లర్ (Crime Thriller) నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో నయా లుక్‌లో కనిపించనున్నాడు ఆనంద్. ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ నుంచి కాన్సెప్ట్ పోస్టర్స్(Concept Posters) రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్స్ చూస్తుంటే...ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Also Read: Inthandamga lyrical video song: ఇంతందంగా ఉంటుందా ఈ లోకం సాంగ్ విడుదల
ఒకరితో ఒకరికి సంబంధం లేని నలుగురు వ్యక్తుల కథే హైవే అన్నారు డైరెక్టర్ కేవి గుహన్. పూర్తిగా హైవే నేపథ్యంలోనే సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని పేర్కొన్నారు. టెక్నికల్ పరంగా హై స్టాండర్డ్‌లో ఉంటుందని చెప్పారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా వెంకట్ తలారి(Venkat Talari) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మీర్జాపూర్, పాతాళ్‌లోక్ వంటి సిరీస్‌లతో తెలుగులోనూ ఫేమస్ అయిన బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జి కీలకపాత్ర పోషిస్తుండగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సయామీఖేర్(Saiyamikher) ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఇటీవల పుష్పక విమానం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook