Inthandamga lyrical video song: కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న గుడ్ లక్ సఖి మూవీ నుంచి ఇంతందంగా ఉంటుందా సాంగ్ విడుదలైంది. సాంగ్ కూడా లిరిక్స్ తగినట్టుగానే అందంగా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసి పాడిన ఇంతందంగా ఉంటుందా లోకం సాంగ్ మ్యూజిక్ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. బంజారా ఓకల్స్కి లిరిక్స్ కమల్ ఎస్లావత్ అందించగా మంగ్లీ పాడారు. ఇక మిగతా భాగానికి శ్రీమణి లిరిక్స్ అందించగా.. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించాడు. ఇంకా ఎందుకు మరి ఆలస్యం.. ఇంతందంగా లిరికల్ సాంగ్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.
జీవితంలో బ్యాడ్ లక్, గుడ్ లక్ అంటూ ఏమీ ఉండదు.. కష్టపడనిదే ఏదీ సాధ్యం కాదు అనే కాన్సెప్టుతో, గ్రామీణ నేపథ్యంతో గుడ్ లక్ సఖి మూవీని తెరకెక్కించినట్టు గుడ్ లక్ సఖి ట్రైలర్ (Good luck sakhi trailer) చూస్తే అర్థమవుతోంది. జగపతి బాబు ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.
Also read : Akhanda Movie Review: ‘అఖండ’ మూవీ రివ్యూ.. బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ సాధించారా?
నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన గుడ్ లక్ సఖి మూవీని (Good luck sakhi movie latest updates) సుధీర్ చంద్ర పడిరి, శ్రావ్య వర్మ కలిసి నిర్మించగా.. దిల్ రాజు ప్రజెంట్ చేస్తున్నాడు. డిసెంబర్ 10న గుడ్ లక్ సఖి మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ముందుకు రానుంది.
Also read : Mahesh Babu with NBK: మహేష్ బాబుతో బాలయ్య బాబు Unstoppable
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook