Gam Gam Ganesha Movie Teaser: ఈ ఏడాది బేబీ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు ఆనంద్ దేవరకొండ. ఈ హీరో నయా మూవీ 'గం గం గ‌ణేషా'(Gam Gam Ganesha Movie). ఉద‌య్ బొమ్మిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్ర‌గ‌తి శ్రీ వాస్త‌వ‌ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి చైత‌న్ భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.  తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రచార చిత్రం అమ్మాయిల్ని టీజ్ చేస్తే పెదాల‌పై న‌వ్వు రావాలి కానీ క‌ళ్ల‌లో నుంచి నీళ్లు రాకూడ‌ద‌ని రౌడీల‌తో ఆనంద్ దేవ‌ర‌కొండ చెప్పే డైలాగ్ తో ప్రారంభమవుతుంది. కామెడీ తో మొద‌లై ఆ త‌ర్వాత యాక్ష‌న్, రొమాంటిక్ మోడ్‌లోకి టీజర్ టర్న్ అవుతుంది. ఇందులో యాక్షన్, రొమాంటిక్ సీన్స్ టీజర్ కు  హైలెట్ గా నిలిచాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దొరసాని సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda). తొలి చిత్రంతో తన నటనతో ఆకట్టుకున్నాడు ఆనంద్. ఆ తర్వాత అతడు నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ క్లాసిక్ హిట్ గా నిలిచింది. అనంతరం వచ్చిన పుష్పక విమానం ఓ మోస్తరుగా ఆడింది. హైవే కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ సినిమా చేశాడు. ఈ మూవీలో ఇతడి నటనకు ప్రముఖుల ప్రశంసలు లభించాయి. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇతగాడి నటనకు ఫిదా అయ్యాడు. బేబీ సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమాపై కావడంతో గం గం గ‌ణేషా మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇతడు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు.



Also Read: Jawan Movie: జవాన్ సినిమాకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు..: దీపికా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook