Ananya Grand Pre Release Event: ఘనంగా పెద్దల సమక్షంలో `అనన్య` ప్రీ - రిలీజ్ వేడుక.. ఈ నెల 22న విడుదల..
Ananya Grand Pre Release Event:జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మూవీ `అనన్య`. ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వంలో... శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ పతాకంపై ఫస్ట్ మూవీగా తెరకెక్కింది. మా నాగ శివ గంగాధర శర్మ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక టాలీవుడకు చెందిన సీనియర్ నటీనటుల సమక్షంలో ఘనంగా జరిగింది.
Ananya Grand Pre Release Event:గత కొన్నేళ్లుగా తెలుగులో హర్రర్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగులో వస్తోన్న మరో హార్రర్ కుటుంబ ప్రేమ కథా చిత్రం 'అనన్య'. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 22న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో "అనన్య" ప్రి రిలీజ్ ఈవెంట్‌ను హైద్రాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఈ చిత్రంలో కీలక రోల్ పోషించిన ఒకప్పటి స్టార్ హీరో సుమన్, యంగ్ హీరో సందీప్ మాధవ్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ప్రముఖ దర్శకనిర్మాత సాయి వెంకట్, విశ్రాంత న్యాయమూర్తి మాల్యాద్రి, శ్రీనివాస్ బోగిరెడ్డి, యువ దర్శకుడు అఫ్జల్ తోపాటు యూనిట్ సభ్యులు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అంతేకాదు 'అనన్య' మూవీ అద్భుత విజయం సాధించాలని ఈ సందర్భంగా అతిధులు ఆకాక్షించారు.
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న "అనన్య" అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ "శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్"కు శుభారంభాన్నిస్తుందని నిర్మాత జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ పేర్కొన్నారు. సెన్సార్ సభ్యుల ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారని చెప్పుకొచ్చారు. ఈనెల 22న వస్తున్న "అనన్య" ప్రేక్షకుల ఆదిరిస్తారనే నమ్మకం ఉందని దర్శకుడు ప్రసాద్ రాజు బొమ్మిడీ తెలిపారు. తమ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసి, ఆల్ ది బెస్ట్ చెప్పిన హీరో శ్రీకాంత్ కు దర్శకనిర్మాతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
సీతా శ్రీనివాస్, శివాని శర్మ, చక్రవర్తి, జబర్దస్త్ అప్పారావు, పొట్టి చిట్టిబాబు, సుజాత, క్రాక్ శ్రీమణి ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: హరికృష్ణ, వెంకట రమణ బొమ్మిన అందించారు. మ్యూజిక్: త్రినాద్ మంతెన అందించారు. కెమెరా: ఎ.ఎస్.రత్నం, ఎడిటింగ్: నందమూరి హరి, సహ నిర్మాత: బుద్ధాల సత్యనారాయణ, సమర్పణ; శ్రీమతి జంధ్యాల రత్న మణికుమారి, నిర్మాత: జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ప్రసాద్ రాజు బొమ్మిడి
Also Read: BRS Party: బీఆర్‌ఎస్ పార్టీ సంచలనం.. వారిని కాదని వీరికి నాలుగు టికెట్లు కేటాయింపు మరి గెలుస్తారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి