Ananya Nagalla Video : ఆ తిప్పడం ఏంటి?.. ఆ చూపులు ఏంటి?.. మెంటలెక్కించేస్తోన్న అనన్య నాగళ్ల
Ananya Nagalla Latest Reel Video అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. అనన్య అందాల ప్రదర్శన గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. అనన్య ఇప్పుడు కొత్త రకమైన రీల్ వీడియో చేసింది.
Ananya Nagalla New Video వకీల్ సాబ్ సినిమాతో అనన్య నాగళ్ల ఎక్కువగా ఫేమస్ అయింది. అంతకు ముందు మల్లేశం సినిమాతో అందరినీ మెప్పించింది. నటిగా అనన్య నాగళ్ల ట్రైనింగ్ తీసుకుంది. ఇన్ స్టిట్యూట్ నుంచి అనన్య నాగళ్లకు మల్లేశం సినిమా ఆఫర్ వచ్చింది. అయితే మల్లేశం సినిమాతో నటిగా గుర్తింపు అయితే వచ్చింది. కానీ ఎక్కువగా అవకాశాలు అయితే రాలేదు.
అనన్య నాగళ్ల మోడ్రన్ లుక్‌లో కనిపించే అంత వరకు ఆ యాంగిల్ ఒకటి ఉందని ఎవ్వరికీ అర్థం కాలేదు. వకీల్ సాబ్ సినిమా తరువాతే అనన్య తనలోని మరో కోణాన్ని బయటపెట్టేసింది. అనన్య చేస్తోన్న అందాల ప్రదర్శనకు అందరూ నోరెళ్లబెట్టేస్తున్నారు. అనన్య ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటోంది.
ఆమె చేతిలో ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్టులున్నాయో కూడా తెలియడం లేదు. అసలు సినిమాలు చేస్తుందా? లేక ఇన్ స్టాగ్రాంలో ఫోటో షూట్లు, రీల్ వీడియోలు అంటూ తిరుగుతుందా? అన్నది తెలియడం లేదు. అయితే అనన్యకు మాత్రం క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే వస్తోంది.
అనన్య నడుము, నాభి అందాలకు కుర్రాళ్లంతా ఫిదా అవుతుంటారు. చెక్కిన శిల్పంలా తన సోయగాలు ఉండటం, వాటిని అనన్య చాలా తెలివిగా ప్రదర్శిస్తుండటంతో సోషల్ మీడియాలో ఆమెకు ఎక్కువగా క్రేజ్ వచ్చేస్తోంది. అందుకే చేతిలో ప్రాజెక్టులేవీ లేకపోయినా కూడా అనన్య సోషల్ మీడియాలోని క్రేజ్‌తో హాయిగా ఉంటోంది.
తాజాగా అనన్య నాగళ్ల షేర్ చేసిన వీడియోను చూస్తే అంతా షాక్ అవ్వాల్సిందే. ఆమె తన మొహంలోని ఎక్స్‌ప్రెషన్స్‌ను ఏ మాత్రం మార్చుకోకుండా అలా సీరియస్‌గానే చూస్తోంది. అలా సీరియస్‌గా చూస్తూ ఉన్నా కూడా తన నడుమును వయ్యారంగా తిప్పుతూ కనిపించింది. ఆ చూపుల్తోనే తినేసేలా చూసేస్తోండటంతో నెటిజన్లకు మెంటలెక్కేస్తోందట. ఈ మేరకు నెటిజన్లు అనన్య అందాలను పొగిడేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook