Ananya Nagalla Surgery: అక్కడ సర్జరీ చేయించుకున్న అనన్య.. మొదటికే మోసం రావడంతో!
Ananya Nagalla Undergoes a Lip Surgery: అనన్య నాగళ్ల తాజాగా సర్జరీ చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
Ananya Nagalla Undergoes a Lip Surgery: సినీ నటీనటులకు అందమే పెట్టుబడి. అందంగా లేనివారు కూడా నటనతో లాక్కొస్తూ ఉంటారు కానీ హీరోయిన్లు మాత్రం అందాన్ని కాపాడుకోవాల్సిందే. అందంగా ఉన్నా సరే మరింత అందంగా కనబడటం కోసం వారు కొన్ని సార్లు సర్జరీ లాంటివి చేయించుకుంటూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సినీ భామలు తమ ముఖాలకు అలాగే ఇతర శరీర భాగాలకు సర్జరీలు చేసుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి.
ఈ మధ్యనే కృతి శెట్టి తన లిప్ సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో భామ కూడా అలాగే లిప్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఒక షార్ట్ ఫిలింలో నటించి తరువాత మల్లేశం సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మల్లేశం సినిమా తర్వాత ప్లే బ్యాక్, వకీల్ సాబ్ లాంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న అనన్య నాగళ్ల తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ భామ తన అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం ఒక ప్రయత్నం చేయగా అది బెడిసి కొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే అనన్య పెదవులు చాలా చిన్నగా ఉన్నాయని కామెంట్లు వస్తూ ఉండడంతో ఆమె తన పెదవులను సర్జరీ చేయించి పెద్దవిగా చేయించుకోవాలని భావించిందని అంటున్నారు. అలా ఈమధ్యనే ఆమె సర్జరీ చేయించుకోవడంతో న ఇప్పుడు అనన్య పెదవులు మరీ లావుగా మారిపోయి ఆమె అందాన్ని మరింత ఇబ్బంది పెడుతున్నాయని కామెంట్లు వస్తున్నాయి. ఆమె సర్జరీకి ముందే బాగుందని ఇప్పుడు ఆమె పెదవులు లావు అవడంతో అసలు ఏమీ బాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
Also Read: Allu Arjun at India Day parade: అమెరికాలోనూ తగ్గేదేలే అనిపించిన అల్లు అర్జున్.. మామూలు క్రేజ్ కాదుగా
Also Read: Telugu Movie Releases: లైగర్- రిపీట్ సహా ఈ వారం రిలీజవుతున్న సినిమాలివే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి