Telugu Movie Releases: లైగర్- రిపీట్ సహా ఈ వారం రిలీజవుతున్న సినిమాలివే!

Telugu Movie Ott and Theatre Releases this Week:  ఈవారం ధియేటర్లలో అలాగే ఓటీటీలో విడుదల కాబోతున్న తెలుగు  సినిమాలకు సంబంధించి మాకు ఉన్న సమాచారాన్ని మీకందించే ప్రయత్నం చేస్తున్నాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 23, 2022, 12:04 PM IST
Telugu Movie Releases: లైగర్- రిపీట్ సహా ఈ వారం రిలీజవుతున్న సినిమాలివే!

Telugu Movie Releases: ఈవారం ధియేటర్లలో అలాగే ఓటీటీలో విడుదల కాబోతున్న తెలుగు అలాగే ఇతర భాషల సినిమాలకు సంబంధించి మాకు ఉన్న సమాచారాన్ని మీకందించే ప్రయత్నం చేస్తున్నాం. జి ఫైవ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, హాట్ స్టార్, సోనీ liv వంటి ప్లాట్ ఫామ్స్ లో ఈ వారం గత వారంతో పోల్చుకుంటే కాస్త తక్కువగానే సినిమాలు విడుదలవుతున్నాయి. ముందుగ టాప్ గన్ మ్యావరిక్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 24వ తేదీ నుంచి స్ట్రీమ్ కాబోతోంది.

ప్రపంచవ్యాప్తంగా వన్ బిలియన్ డాలర్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.  ఇక ఢిల్లీ క్రైమ్ సీజన్ 2 నెట్ ఫిక్స్ లో 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సీజన్ వన్ కి మంచి క్రేజ్ దక్కడంతో రెండో సీజన్ మీద కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇవి కాకుండా నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో రూపొందిన రిపీట్ అనే సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 25వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో అంచనాలు రేకెత్తించింది.

ఇక 2018లో విడుదలైన తమిళ చిత్రం ఒకటి తెలుగులో విడుదల కాబోతోంది. దాన్ని ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, మెగా డాక్టర్ నిహారిక కొణిదెల జంటగా తెరకెక్కింది . 018 లో తమిళంలో విడుదలై ఓ మాదిరి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా 26వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది. ఇక తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన రాచ్చసన్ హిందీ రీమేక్ సెప్టెంబర్ రెండో తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటించారు.

ఇక తెలుగు థియేటర్ విడుదలల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్  తెరకెక్కించిన  లైగర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 25వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతోంది. ఈ నేపద్యంలో ఆరోజున తెలుగు సినిమాలు మరేవీ  విడుదల చేయడం లేదు. అయితే ఒక రోజు తరువాత కళాపురం అనే ఒక సినిమా విడుదల చేస్తున్నారు. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలు తెరకెక్కించిన కరుణకుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ నేపథ్యంలో సాగబోతోంది. 

Also Read: Karthikeya2 Collections: ఆదివారం రచ్చ రేపిన వసూళ్లు.. టోటల్ ఎన్ని కోట్లంటే?

Also Read: Vijay Devarakonda Mother Video: మాది దొరల ఫ్యామిలీ..మేము దొరసానులమన్న విజయ్ తల్లి.. దారుణమైన ట్రోలింగ్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News