Anasuya Bharadwaj ABout Her Remuneration : కొందరు డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నామని నిర్మొహమాటంగా చెబుతుంటారు. డబ్బు కోసమే అలాంటి పాత్రలు చేస్తున్నామని ఒప్పుకుంటారు. యాంకర్ రష్మీ గతంలో ఓ సారి అలితో సరదాగా ఇంటర్వ్యూలోనూ అదే మాటలు చెప్పింది. డబ్బే ప్రధానం.. డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఇక అనసూయ అయితే కాస్త వెరైటీగా చెప్పింది. డబ్బు కోసమే తాను సినిమాలు చేయడం లేదు అని వివరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనసూయ చేతిలో ప్రస్తుతం డజనుకు పైగా సినిమాలున్నాయి. ఇంకా కొన్ని ప్రారంభం కావాల్సి ఉంది. ఇంకొన్ని సెట్స్ మీదున్నాయి. ఇంకొన్ని సినిమా షూటింగ్‌లు పూర్తయ్యాయి. అయితే ఇలా అనసూయ చేతిలో బోలెడన్ని ప్రాజెక్టులున్నాయి. ఈ విషయాన్ని అనసూయ కూడా చెప్పేసింది. అయితే అనసూయ చెప్పిన ఈ లిస్ట్ చూసి ఓ నెటిజన్ ఇలా అన్నాడు. ఇన్ని సినిమాలు చేస్తున్నారు కదా? మీకు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారేమో? అని అనేశాడు. దానికి అనసూయ ఇలా సమాధానం ఇచ్చేసింది.


[[{"fid":"254977","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


చాలా మంది ఇలానే అనుకుంటారు.. అందరి గురించి నాకు తెలీదు గానీ.. నేను మాత్రం అన్ని సినిమాలు డబ్బు కోసమే చేయను.. ఇంతకు ముందు చెప్పినట్టుగా కొన్ని మంచి పేరు కోసం చేస్తాను.. పలానా నటుడు అంటే ఇష్టంతోనో.. క్యారెక్టర్ నచ్చి బడ్జెట్ తక్కువ అయినా కూడా.. నేను వర్క్ చేస్తే నాతో పాటు చాలా మందికి ఉపాధి వస్తుంది.. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది ఏంటంటే.. ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు ఏ సినిమా అయినా చేస్తాను.. కానీ డబ్బు కోసం కాదు.. నన్ను నమ్మండి అని అనసూయ చెప్పింది.


ఇక అనసూయ చేతిలో ప్రస్తుతం.. రంగమార్తాండ, హరిహర వీరమల్లు తెలుగు చిత్రాలు కాగా.. చేజ్, ఫ్లాష్‌ బ్యాక్ అనేవి తమిళ తెలుగు ద్విభాష చిత్రాలు లైన్లో ఉన్నాయట. ఇంకో తమిళ సినిమా షూటింగ్ అయింది.. డబ్బింగ్ కావాల్సి ఉందట.. మైఖేల్, సింబా, అరి అనే సినిమాలున్నాయని తెలిపింది. ఇంకో తెలుగు సినిమా ఉంది.. కానీ ఇప్పుడే వాటి డీటేల్స్ చెప్పలేనని పేర్కొంది.. పుష్ప పార్ట్ 2 సెట్‌లోకి త్వరలోనే అడుగుపెట్టబోతోందట.. ఈ నెలలో ఇంకో రెండు చిత్రాలు స్టార్ట్ చేస్తానని, త్వరలోనే మలయాళంలో మరో పెద్ద సినిమాను స్టార్ట్ చేయబోతోన్నాను తెలిపింది.


Also Read : Jabardasth Sujatha : సుజాత అతి చేష్టలు.. రాకేష్‌తో చెట్టాపట్టాలేసుకుంటూ.. నెటిజన్ల సెటైర్లు


Also Read : Ajith Thunivu : అజిత్ సినిమా కూడా సంక్రాంతికేనా?.. దళపతి విజయ్ రియాక్షన్ వైరల్‌


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook