Ajith Thunivu : అజిత్ సినిమా కూడా సంక్రాంతికేనా?.. దళపతి విజయ్ రియాక్షన్ వైరల్‌

Thalapathy Vijay Reaction on Ajith Thunivu దళపతి విజయ్ తాజాగా అజిత్ సినిమా కూడా సంక్రాంతికే రాబోతోందని తెలుసుకుని సంతోషించాడట. అజిత్ నా ఫ్రెండ్.. ఆయన సినిమా, నా సినిమా రెండూ బాగా ఆడాలి అనే టైపులో మాట్లాడాడట.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2022, 07:21 AM IST
  • సంక్రాంతి బరిలో విజయ్ వర్సెస్ అజిత్
  • వారిసుకి పోటిగా అజిత్ తునివు
  • కిక్ శ్యామ్ మాటలతో దళపతి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
Ajith Thunivu : అజిత్ సినిమా కూడా సంక్రాంతికేనా?.. దళపతి విజయ్ రియాక్షన్ వైరల్‌

Thalapathy Vijay Reaction on Ajith Thunivu అది టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా కూడా ఫ్యాన్ వార్ అన్నది కామన్. మరీ ముఖ్యంగా కోలీవుడ్‌లో అయితే చంపుకునేదాక వెళ్తుంటుంది. అక్కడ ఉన్నది ఫ్యానిజం కాదు.. కాస్త వెర్రితనం అని ఒక్కో సందర్భంలో అనిపిస్తుంటుంది. ఎప్పుడూ అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్యే వార్ జరుగుతూ ఉంటుంది. ఈ ఇద్దరి హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డప్పుడల్లా అదొక పెద్ద యుద్దంలానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఇరువురు హీరోల అభిమానులు తిట్లతో తారాస్థాయికి వివాదాలను తీసుకెళ్తుంటారు.

కానీ విజయ్, అజిత్‌లు ఇద్దరూ కూడా మంచి స్నేహితులే. ఫ్యాన్ వార్ కాస్త తగ్గించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ అభిమానులు మాత్రం వినరు. దళపతి గ్రేట్ అని విజయ్ ఫ్యాన్స్, తలా గ్రేట్ అని అజిత్ ఫ్యాన్స్ వాదించుకుంటూనే ఉంటారు. ఇక ఇప్పుడు వారిసు, తునివు సినిమాల మధ్య ఫ్యాన్ వార్ మొదలైంది. గత కొన్ని రోజులుగా ఇరు పక్షాలు ఒకరి మీద మరొకరు ట్రోలింగ్ చేసుకుంటూనే ఉంటున్నారు.

విజయ్ వారిసు, అజిత్ తునివు చిత్రాలు సంక్రాంతికి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఈ రెండు చిత్రాలకు సరిపడా థియేటర్లు ఇస్తామని ఉదయ నిధి స్టాలిన్ అన్నాడు. మొత్తానికి ఈ రెండు చిత్రాల నడుము కోలీవుడ్ బాక్సాఫీస్ మాత్రం నలిగిపోయేట్టుగా ఉంది. బయట పోటీ ఇలా ఉంటే.. లోపల మాత్రం హీరోలు ఫుల్ కూల్‌గా ఉన్నట్టు కనిపిస్తోంది.

సంక్రాంతికే అజిత్ తునివు సినిమా కూడా రిలీజ్ కాబోతోందని విజయ్‌తో కిక్ శ్యామ్ అన్నాడట. అప్పుడు విజయ్ ఇలా రియాక్ట్ అయ్యాడట.. అవునా?. నిజమా సంతోషం.. అజిత్ నా ఫ్రెండే.. ఆయన సినిమా బాగుంటుంది.. మన సినిమా కూడా బాగుంటుంది అని అన్నాడట. ఈ విషయాన్ని కిక్ శ్యామ్ బయట పెట్టేశాడు. విజయ్ వారిసు సినిమాలో కిక్ శ్యామ్ పవర్ ఫుల్ రోల్‌ పోషిస్తోన్న సంగతి తెలిసిందే.

Also Read : Jabardasth Sujatha : సుజాత అతి చేష్టలు.. రాకేష్‌తో చెట్టాపట్టాలేసుకుంటూ.. నెటిజన్ల సెటైర్లు

Also Read : Selfish Movie : వారసుడిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు.. అన్న కొడుకు కోసం దిల్ రాజు కష్టాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News