Anchor Anasuya Comments on TV Shows: బుల్లితెరపై జబర్దస్త్ షోతో యాంకర్‌గా అనసూయకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. అంతకు ముందు వార్తలు చదువుతూ ఉండేది. ఆ తరువాత బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలు చేసింది. అయితే ఇప్పుడు అనసూయ పూర్తిగా బుల్లితెరకు దూరంగా ఉంటోంది. కారణాలు  సరిగ్గా చెప్పడం లేదు గానీ.. ఆమె మాత్రం బుల్లితెరపై వచ్చే కాన్సెప్ట్‌లను చూసి విసిగెత్తిపోయినట్టుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనసూయను బుల్లితెరపై మిస్ అవుతున్నామని, ఆమె నవ్వులను మిస్ అవుతున్నామని అభిమానులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ఇక అనసూయ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టిన ప్రతీ సారి ఈ ప్రశ్నను ఎదుర్కొంటూనే ఉంటుంది. మీ నవ్వులు మిస్ అవుతున్నాం, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం.. మళ్లీ బుల్లితెరపై ఎంట్రీ ఎప్పుడు ఇస్తారంటూ అనసూయను ఫ్యాన్స్ అడుగుతుంటారు.


బుల్లితెరపై కాన్సెప్ట్‌లు సరిగ్గా ఉండటం లేదని, టీఆర్పీ స్టంట్లు ఎక్కువయ్యాయ్ అని, అవి తగ్గి.. కాన్సెప్ట్ మీద షోలు ఎప్పుడు వస్తాయో అప్పుడు నేను మళ్లీ షోలు చేస్తాను అంటూ గతంలో అనసూయ చెప్పింది. అసలు జబర్దస్త్ షోనుంచి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. ఆ తరువాత సింగింగ్ షోను ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాలు మాత్రం చెప్పలేదు.


తాజాగా మరోసారి అనసూయకు ఇలాంటి ఓ ప్రశ్నే ఎదురైంది. దానికి ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది అనసూయ. నేను కూడా బుల్లితెరను మిస్ అవుతున్నాను.. పెళ్లి తరువాత పుట్టింటిని ఎలా మిస్ అవుతున్నానో నేను ఇప్పుడు బుల్లితెరను అలా మిస్ అవుతున్నాను.. మంచి జెన్యూన్ కంటెంట్‌తో ఓ షోను ప్లాన్ చేసి నాకు ఆఫర్ చేస్తారని ఆశిస్తున్నాను.. అంతే కాకుండా జనాలకు కూడా ఏది రియల్, ఏది రీల్ అనే తేడాలను తెలుసుకునే తెలివి వస్తుందని ఆశిస్తున్నాను.. అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.


 Also Read:  Dasara Collection : దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్?.. నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దల్


Also Read: Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook