Trolls on Anasuya: బుల్లితెరపైనే కాదు వెండితెరపైనే మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి, యాంకర్ అనసూయ (Anusuya). ఇటీవల ఈ అమ్మడు ​ 'పుష్ప' సినిమాలో దాక్షాయణిగా నటించి మెప్పించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో (Social Media) యాక్టివ్ గా ఉండే అనసూయ తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తాజాగా రిపబ్లిక్​ డే (Republic Day 2022) సందర్భంగా అనసూయ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఆమె చేసిన పని ఏంటంటే.. అనసూయ జాతీయ గేయాన్ని (National Anthem) నిలుచుని పాడకుండా కుర్చీలో కూర్చొని పాడింది. జాతీయ గీతం, జాతీయ గేయం ఏదైనా సరే మనం గౌరవిస్తూ ఆ రెండు పాడే సమయాల్లో లేచి నిల్చుంటాం. అనసూయ అలా చేయకుండా కూర్చొని పాడేసరికి నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అలాగే అనసూయ వేసుకున్న టీషర్ట్​ మీద గాంధీ బొమ్మ ఉండటంతో గాంధీ బొమ్మ ఎందుకు వేసుకున్నావ్​.. ఈరోజు అంబేడ్కర్​ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగానికి గాంధీకి సంబంధం ఏంటని కామెంట్ పెట్టారు. 


Also Read: Upasana FB Post: ఉపాసన ఫేస్‌బుక్‌ పోస్ట్‌పై రచ్చ రచ్చ.. డిలీట్ చేసెయ్‌ అంటోన్న నెటిజెన్స్‌!


ఈ విషయంపై అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఒక యూజర్​ కామెంట్​కు 'లేదు.. నేనే సారీ చెబుతున్నా. ఇదంతా చూస్తుంటే నేను నిల్చోకుండా పాడినందుకు చాలా మంది హర్ట్​ అయినట్టున్నారు'. అలాగే టీ షర్ట్​పై గాంధీ బొమ్మపై వచ్చిన కామెంట్లకు 'అరే ఏందిరా బై మీ లొల్లి.. నేషనల్ ఆంథమ్ అంటారు. గాంధీకి రాజ్యాంగానికి సంబంధం ఏంటని అంటారు. మరి జనగణమణ ఏంది.. ఆగస్ట్​ 15, 1947 తర్వాతే జనవరి 26, 1950 అయింది. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకోనన్నా మాట్లాడండి. హ్యాపీ రిపబ్లిక్​ డే' అని చెప్పింది అనసూయ. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook