Superfoods for bloating: కడుపులో గ్యాస్, అజీర్తికి చెక్ పెట్టే 5 సూపర్ ఫుడ్స్ ఇవే..

Superfoods for reducing bloating: కడుపులో గ్యాస్, అజీర్తి అనేది మనం తీసుకునే ఫుడ్ వల్ల జరుగుతుంది. కడుపులో గ్యాస్ పేరుకుపోవడం వల్ల ఇలా అజీర్తి సమస్యలు వస్తాయి. కొన్ని క్లినికల్ నివేదికల ప్రకారం కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అయితే కొన్ని సూపర్ ఫుడ్స్ డైట్లో చేర్చుకోవడం వల్ల కడుపులో అజీర్తి గ్యాస్ కి చెక్ పెట్టవచ్చు ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.
 

1 /6

అజీర్తి లక్షణాలు.. కడుపు నిండుగా అనిపించడం కడుపులో నొప్పి కొన్ని రకాల శబ్దాలు వినిపించడం జరుగుతుంది.అజిర్తి సమస్యను నివారించే ఆహారాలు ఇవే

2 /6

టమాటా..  టమాటాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా ఇందులో లైవ్ ఒపీని ఉంటుంది ఇది కడుపులో మంట వాపు సమస్యను తగ్గిస్తుంది అంతే కాదు ఇందులో పొటాషియం కూడా ఉండటం వల్ల అజీర్తి సమస్య దరిచేరదు.

3 /6

అరటి పండ్లు.. వెబ్ ఎండి నివేదిక ప్రకారం అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల కడుపులో అజీర్తి మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది దీంతో గట్ ఆరోగ్యంగా ఉంటుంది

4 /6

అవకాడో.. అవకాడోలు ఒక సూపర్ ఫుడ్ ఇందులో ఫైబర్ మన శరీరాన్ని కావాల్సిన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు అవకాడో లో పొటాషియం జీర్ణం క్రియకు మెరుగు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇందులో ప్రక్టోస్ లెవెల్స్ కూడా తక్కువ మోతాదులో ఉంటాయి ఇది గ్యాస్ సమస్యను నిరోధిస్తుంది.

5 /6

పసుపు.. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే ఇందులో ఉండే ఖర్కుమీన్ అజీర్తి సమస్యలు నివారించి జీర్ణక్రియకు సహకరిస్తాయి.

6 /6

అస్పర్గస్.. వేబ్ ఎండి నివేదిక ప్రకారం ఆస్ట్ పర్గస్ లో ఈనులిన్ ఉంటుంది ఇది కరగని ఫైబర్ ఇది కడుపులో గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )