Anasuya-Vijay Devarakonda: అర్జున్ రెడ్డి సినిమా విజయ దేవరకొండకి ఎంతమంది అభిమానులను తెచ్చిపెట్టిందో.. అంతే మంది విమర్శకులను కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమాలోని.. కొన్ని డైలాగ్స్ అమ్మాయిలను కించపరిచేలా.. ఉన్నాయని అప్పట్లో ఎంతోమంది కామెంట్స్ చేశారు. వీరిలో అనసూయ కూడా ఉంది. యాంకర్ గా.. ఆ తరువాత సినిమాల్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ.. అర్జున్ రెడ్డి సినిమా దగ్గర నుంచి విజయ్ దేవరకొండ అభిమానులకి..విలన్ అయి కూర్చుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ్ దేవరకొండ సినిమాల్లో ఉండే కొన్ని అసౌకర్యకరమైన సీన్స్ ని.. డైరెక్ట్ గానే విమర్శించింది అనసూయ. అయితే తమ అభిమాన హీరో సినిమాలని.. అలా అనడం నచ్చని అభిమానులు ఆమెపై సోషల్ మీడియాలో ట్రొల్స్ మొదలుపెట్టారు. 


ఇక అప్పటినుంచి.. అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య ఒక తెలియని యుద్ధం మొదలైంది. విజయ్ దేవరకొండని కూడా కొంతమంది ఇంటర్వ్యూలో.. అనసూయ గురించి అడగగా.. మీరు ఆమెనే అడగండి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఇక అనసూయ పలుమార్లు.. డైరెక్ట్ గా.. కొన్నిసార్లు ఇన్ డైరెక్ట్ గా.. విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ వచ్చింది.


ఈ క్రమంలో నిన్న అనసూయ సింబ.. రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా.. అక్కడ కూడా విజయ్ దేవరకొండ గురించి టాపిక్ రావడం.. దానికి అనసూయ రిప్లై ఇవ్వడం.. ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఈ ఈవెంత్ లో ఈమె మాటలు విన్న విజయ్ దేవరకొండ అభిమానులు ఈ రచ్చను సోషల్ మీడియాలో మరింత పెద్దది చేస్తున్నారు 


సింబా ట్రైలర్ లో ఒక విజయ్ దేవరకొండ డైలాగ్ ఉండగా.. ఆ డైలాగ్ గురించి ఒక జర్నలిస్ట్ అడుగుతూ.. విజయ్ దేవరకొండ పేరు వాడుతూ ఓ డైలాగ్ చెప్పారు. అంటే మీకు, విజయ్ దేవరకొండకి గొడవలు ముగిసినట్టేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? అని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ..అనసూయ..”నాకు ఏం గొడవలు లేవు. మామూలుగా మనం సెలబ్రిటీస్ అయినప్పుడు.. మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. వాళ్ళు అలా మాట్లాడితే మీరందరూ సైలెంట్ గానే ఉన్నారు. మీరక్కడ రియాక్ట్ అవ్వలేదు. మీకు తప్పనిపించలేదు. నేనక్కడ ఎవరిని హేట్ చెయ్యలేదు.. కానీ ఒక సంఘటనలో తప్పు జరిగితే నేను ప్రశ్నించాను” అంటు చెప్పుకొచ్చింది.  దీంతో అనసూయ కామెంట్స్ వైరల్ అవ్వగా.. మరోసారి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ .. అనసూయ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు.


 




తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ.. అనసూయ ఎవర్ని డైరెక్ట్ గా ఉద్దేశించకుండా ఓ ట్వీట్ చేసింది. అనసూయ తన ట్వీట్ లో.. “మరీ మీరు ఇంత చాతకాని వాళ్ళ లాగా ఉంటే ఎలాగండి. మీకు అంతలా కాలుతోంది అంటే అది నావల్ల కాదు. అస్తమానం నేను ఏం పని చేసినా.. ఏం మాట్లాడినా.. ఆ టాపిక్ లాగే వాళ్ళని.. అనండి దమ్ముంటే. కానీ మీరు అలా ఎప్పటికీ చేయలేరు ఎందుకంటే మీకు అది చేతకాదు కాబట్టి. మీ హీరో లాగే మీకు కూడా ఆడవాళ్ళని ఉద్దేశించి.. బూతులు తిట్టడం మాత్రమే వచ్చినట్లుంది పాపం. నేను ఇప్పటికి మీ అందరి గురించి ప్రార్థిస్తాను.. మీరు మంచి పని చేసుకోవాలి “ అంటూ పోస్ట్ వేసింది. ఇక ఈ గొడవ ఎక్కడ వరకు వెళుతుందో.. విజయ్ దేవరకొండ, అనసూయకే తెలియాలి.


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook