Anasuya tweeted to KTR : పిల్లల భద్రతపై కేటీఆర్‌కు కంప్లైట్ చేసిన అనసూయ
Anasuya tweeted to Minister KTR : ఎపిల్లల్ని తిరిగి స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని స్కూల్స్ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకు వస్తున్నాయంటూ అనసూయ అన్నారు. పిల్లల భద్రతపై స్కూల్స్ఎలాంటి భరోసా ఇవ్వడం లేదంటూ యాంకర్ అనసూయ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Anchor Anasuya Bharadwaj tweeted to Minister KTR Why are the schools forcing the parents to send the children to school: ఎప్పుడూ షూటింగ్‌లలో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలోనూ ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా చిన్నారుల భద్రత విషయంలో కొన్ని స్కూల్స్ అనుసరిస్తోన్న తీరుపై యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj) అసహనం వ్యక్తం చేశారు. పిల్లల్ని తిరిగి స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని స్కూల్స్ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకు వస్తున్నాయంటూ అనసూయ అన్నారు. పిల్లల భద్రతపై స్కూల్స్ (Schools) ఎలాంటి భరోసా ఇవ్వడం లేదంటూ యాంకర్ అనసూయ మంత్రి కేటీఆర్‌ను (Minister KTR) ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Also Read : Puneeth Rajkumar Health: గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్
కేటీఆర్ సర్.. కరోనా కారణంగా మొదట మనం లాక్‌డౌన్ ఫాలో అయ్యామని అందులో పేర్కొన్నారు యాంకర్ అనసూయ (Anasuya). దేశవ్యాప్తంగా కేసులు క్రమంగా తగ్గుతుండటంతో లాక్‌డౌన్‌ని తొలగించారని ఆ ట్వీట్‌లో మెన్షన్ చేసింది. దేశంలో వ్యాక్సినేషన్ కూడా వేగంగా సాగుతోందని.. కానీ, వ్యాక్సిన్ (Vaccine) తీసుకోని చిన్నారుల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు.
స్కూల్‌లో (school) పిల్లలకు ఏం జరిగినా యాజమాన్యానిది బాధ్యత కాదంటూ స్కూల్స్ తల్లిదండ్రులపై ఎందుకు ఒత్తిడి తెస్తున్నాయని అడిగారు. ఇందుకు సంబంధించి కొన్ని స్కూల్స్ తల్లిదండ్రులు మొదట ఓ అంగీకారపత్రాన్ని తప్పకుండా అందజేయాలని అడుగుతున్నాయి. ఇదెక్కడి న్యాయం? ఈ విషయాన్ని మీరు సమీక్షిస్తారని భావిస్తున్నాను అంటూ అనసూయ (Anasuya) ట్వీట్ చేశారు.
Also Read : Petrol Price today: వరుసగా మూడో రోజూ పెట్రో బాదుడు- కొత్త రికార్డు స్థాయికి ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook