బుల్లితెర యాంకర్ అనసూయ గురించి పెద్దగా పరిచయం అక్కట్లేదు. జబర్దస్త్ కామెడీ షోతో పిచ్చ పాపులారిటీ సంపాదించి.. సినిమాల్లో కూడా నటిస్తూ తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచేసుకుంది ఈ యాంకర్. 2003 సంవత్సరంలో ఎన్టీఆర్ 'నాగ' సినిమాతో పరిచయం అయిన అనసూయ.. తరువాత న్యూస్ ప్రజెంటర్ గా పని చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అడవిశేషు 'క్షణం' సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత సోగ్గాడే చిన్నినాయనా,రంగస్థలం, పుష్ప సినిమాలతో గుర్తింపు తెచ్చుకొని అందరిని ఆకట్టుకుంటుంది. అయితే అనసూయ నటించిన ప్రతి సినిమా హిట్ అవ్వడం గమనార్హం. 


సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బుల్లితెర యాంకర్.. గతంలో అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ తో బన్నీ ఫాన్స్ ఆగ్రహానికి గురైంది. గంగోత్రి సినిమాలో ఒక పాటలో అల్లు అర్జున లంగావోణితో కనపడిన సన్నివేశంపై.. "మెగా ఫ్యామిలీ నుండి వస్తే మాత్రం హీరో అయిపోతారా..?" అంటూ ఘాటు కామెంట్స్ చేయటంతో.. మెగా ఫ్యాన్స్ అనసూయపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Also Read: Yashasvi Jaiswal: వెస్టిండీస్‌ బౌలర్‌‌ను బూతులు తిట్టిన యశస్వి జైస్వాల్.. వీడియో వైరల్  


ఆ తరువాత అనసూయ స్పందిస్తూ.. అల్లుఅర్జున్ డాన్స్, యాక్టింగ్ చాలా ఇష్టమని వివరణ ఇవ్వడంతో మెగా ఫాన్స్ కాస్త శాంతించారు. ఇపుడు కాస్త ఆ టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవటంతో మళ్లీ ఎలాంటి కామెంట్స్ చేస్తారో..? ఈ వివాదం ఎక్కడి వరికి వెళ్తుందో చూడాలి.


ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం జబర్దస్త్ కు గుడ్ బాయ్ చెప్పినప్పటి నుండి సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ.. సినిమాల్లో చాలా బిజీగా అయిపోయింది అనసూయ.  ఈ మద్యే ఒక ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన అనసూయ బీచ్ లో కొన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ అయ్యాయి. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ తోనే  పుష్ప 2 ద్రాక్షాయిణి పాత్రలో నటిస్తుంది.


Also Read: Twitter Ads Revenue: ట్విట్టర్‌ కంటెంట్ క్రియేటర్స్‌కు గుడ్‌న్యూస్.. మాట నిలబెట్టుకున్న ఎలన్ మస్క్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి