Twitter Introduces Ads Revenue Sharing Program: ట్విట్టర్‌లో కీలక మార్పులు చేస్తున్న ఎలన్ మస్క్.. కంటెంట్ క్రియేటర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పారు. మాట ఇచ్చినట్లే యాడ్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రాంను అందుబాటులోకి తీసుకువచ్చారు. కంటెంట్ క్రియేటర్స్‌కు ఆదాయాన్ని షేర్ చేయనున్నట్లు గతంలోనే మస్క్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా క్రియేటర్స్ ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. అర్హులైన క్రియేటర్‌లందరికీ యాప్‌లో, ఇమెయిల్ ద్వారా మొదటి చెల్లింపుగా ఎంత డబ్బు లభిస్తుందో ఇప్పటికే సమాచారం అందజేసింది. వారి ఖాతాలలో డబ్బు ఎప్పుడు జమ చేయనుందో కూడా వివరాలను పొందుపరిచింది.
ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన క్రియేటర్స్.. అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. రైటర్ బ్రియాన్ క్రాస్సెన్‌స్టెయిన్‌కు 7.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా.. రూ.18.23 లక్షలు, 1.7 మిలియన్ల ఫాలోయింగ్ ఉన్న పొలిటికల్ స్పీకర్ బెన్నీ జాన్సన్ రూ.7.16 లక్షలు సంపాదించారు. ఈ అమౌంట్ మొత్తాన్ని స్ట్రైప్ ద్వారా ట్విట్టర్ చెల్లించనుంది.
ట్విట్టర్‌లో కంటెంట్ క్రియేటర్లందరికీ యాడ్ షేరింగ్ రెవెన్యూ ఉండదు. ముందుగా బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఉండాలి. ప్రతి నెలా మీ పోస్ట్‌పై కనీసం 50 లక్షల ఇంప్రెషన్‌లను పొందాలి. ఇలా వరుసగా మూడు నెలలపాటు పొందాలి. అప్పుడే క్రియేటర్ మానిటైజేషన్‌కు అర్హులవుతారు. అంతేకాకుండా ట్విట్టర్ కంటెంట్ మోనిటైజేషన్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే.
కొన్ని విభాగాలపై నిషేధం విధిస్తున్నట్లు గతంలోనే ఎలన్ మాస్క్ ప్రకటించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే స్కీమ్స్, తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించే ఆశ చూపే స్కీమ్‌లు, క్రైమ్, హింస, బెట్టింగ్, డ్రగ్స్ సరఫరా వంటి విభాగాలను ఆయన నిషేధించారు. యాడ్ షేరింగ్‌లో భాగంగా.. మొదటి విడతలో రూ.37.5 కోట్ల రెవెన్యూని క్రియేటర్స్‌కు షేర్ చేయనున్నట్లు చెప్పగా.. తాజాగా అది అమలు చేయడం ప్రారంభించారు.
Surprise! Today we launched our Creator Ads Revenue Sharing program.
We’re expanding our creator monetization offering to include ads revenue sharing for creators. This means that creators can get a share in ad revenue, starting in the replies to their posts. This is part of our…
— Twitter (@Twitter) July 13, 2023
కాగా.. ట్విట్టర్‌కు పోటీగా మెటా కొత్త థ్రెడ్స్ యాప్‌ను ప్రవేశపెట్టింది. దీంతో చాలా మంది వినియోగదారులు థ్రెడ్స్‌కు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే 100 మిలియన్ల మందికిపైగా వినియోగదారులను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం అత్యంత వేగంగా డౌన్‌లోడ్ యాప్‌గా థ్రెడ్స్ మారింది. ఈ నేపథ్యంలోనే పోటీను తట్టుకునేందుకు ట్విట్టర్ సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది.
Also Read: Cyberabad Police: మరణించిన ఎస్సైకి పోస్టింగ్.. పోలీసులు వింత ఉత్తర్వులు
Also Read: Eluru News: కన్నతల్లి కసాయి బుద్ది.. సొంత కుమార్తెలను రెండో భర్తకు అప్పగించిన మహిళ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook