Anchor Anasuya Emotional Post on her Father : అటు యాంకర్‌‌గా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది అనసూయ. బుల్లితెరపై, వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది యాంకర్ అనసూయ (Anchor Anasuya). అయితే అనసూయ ఇంట్లో ఇటీవల ఒక విషాదం చోటుచేసుకుంది. అనసూయ తండ్రి సుదర్శన్‌రావు ఇటీవల మృతి (Died) చెందారు. అయితే తండ్రితో (Father) తనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడింది అనసూయ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"నువ్వు నా మోస్ట్ హ్యాండ్‌సమ్ నాన్నవి.. నిన్ను ఎప్పుడూ నేను గర్వపడేలా చేస్తూనే ఉంటాను" అంటూ తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చింది అనసూయ. "మీరు నాకు ఎంతో విలువైన జీవితాన్ని ఇచ్చారు. తినే విషయంలో, వ్యాయామం విషయంలో కూడా మీరు ఎన్నో విషయాలు మాకు నేర్పేవారు. అసలు మీకు కృతజ్ఞతలు చెప్పేందుకు నా దగ్గర పదాలు కూడా లేవు" అంటూ భావోద్వేగంగా తండ్రి గురించి రాసింది అనసూయ. 


"మనం గడిపిన ఆనంద క్షణాలు నేను ఎప్పటికీ మరిచిపోనూ నాన్న.. అర్ధరాత్రి పూట మీరిచ్చే సర్‌‌ప్రైజ్‌లు, ట్రీట్‌లన్నీ నాకు గుర్తే నాన్న..మీ కోపమంతా పైపైనే.. లోపల మీకు మాపైన చెప్పలేనంత ప్రేమ.. అంటూ తండ్రితో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది" అనసూయ.


Also Read : అభిమానులకు బంపర్ ఆఫర్.. 'పుష్ప' సినిమాకు ఐదో షో! టిక్కెట్ల కోసం ఎగబడుతున్న ఫాన్స్!!


అలాగే మీరిచ్చిన ఈ జీవితానికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదని అనసూయ పేర్కొన్నారు. మాకు నచ్చిన విధంగా లైఫ్‌ను గడిపేలా నేర్పించారని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది అనసూయ. ఎటువంటి కష్టం ఎదురైనా కూడా ధైర్యంగా నిలబడే విధానాన్ని నేర్పించారని పేర్కొంది. టైగర్ దర్శన్ పెహెల్వాన్‌ను మేమంతా ఎప్పటికీ గుర్తుంచుకుంటాం అని భావోద్వేగంతో తన మనసులోని మాటలను తెలిపింది అనసూయ. మిమ్మల్ని గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా నాన్న అని పేర్కొంది. మీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నానంటూ అనసూయ (Anasuya) ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) పోస్ట్‌లో పేర్కొంది.



 


Also Read : Rashmika: 'పుష్ప' ప్రెస్ మీట్‌లో రష్మిక డ్యాన్స్.. సామి సామి అంటూ రచ్చ (వీడియో)!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook