Rashmika Mandanna: 'పుష్ప' ప్రెస్ మీట్‌లో రష్మిక డ్యాన్స్.. సామి సామి అంటూ రచ్చ (వీడియో)!!

ఈరోజు ముంబైలో పుష్ప సినిమా కోసం ప్రెస్ మీట్‌ నిర్వహించారు. ఈ సందరంగా హీరోయిన్‌ రష్మిక మందన్న సామి సామి అనే పాటకు డాన్స్ చేశారు. ఆమెతో పాటు యాంకర్ కూడా స్టెప్పులు వేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 03:44 PM IST
  • పుష్ప ప్రెస్ మీట్‌లో రష్మిక డ్యాన్స్
  • ముంబైలో పుష్ప ప్రెస్ మీట్‌
  • సామి సామి అంటూ రచ్చ చేసిన రష్మిక
Rashmika Mandanna: 'పుష్ప' ప్రెస్ మీట్‌లో రష్మిక డ్యాన్స్.. సామి సామి అంటూ రచ్చ (వీడియో)!!

 Rashmika Mandanna dances to Saami song in Pushpa's Mumbai Press Meet: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'పుష్ప: ది రైజ్‌' (Pushpa). అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్ప రాజ్ పాత్రలో కనిపించనుండగా.. శ్రీవల్లి పాత్రలో రష్మిక కనువిందు చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా క‌లిసి ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మించాయి.  పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం (డిసెంబర్‌ 17) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో శుక్రవారం 'పుష్ప' మొదటి భాగం రిలీజ్ కానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడంతో గత వారం రోజులుగా పుష్ప చిత్రబృందం ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల‌ను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఈరోజు ముంబైలో ప్రెస్ మీట్‌ (Mumbai Press Meet) నిర్వహించారు. ఇందులో సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక, దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత సహా తదితరులు పాల్గొన్నారు. ఈ సందరంగా రష్మిక సినిమా గురించి మాట్లాడిన అనంతరం.. యాంకర్ డాన్స్ చేయని కోరాడు. దాంతో సామి సామి అనే పాటకు రష్మిక డాన్స్ (Rashmika Mandanna Dance) చేశారు. ఆమెతో పాటు యాంకర్ కూడా స్టెప్పులు వేశారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. 

Also Read: Jos Buttler: ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన జోస్ బట్లర్.. బిత్తరపోయిన ఆస్ట్రేలియా ఓపెనర్ (వీడియో)

చిత్తూరు జిల్లా శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పుష్ప (Pushpa) సినిమాను రూపొందిస్తున్నారు. మొదటి భాగం పూర్తికాగా.. ఇందులో అల్లు అర్జున్  (Allu Arjun) పుష్ప రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇది వ‌ర‌కు ఎన్న‌డూ చేయ‌ని ర‌గ్డ్ లుక్‌లో ఐకాన్ స్టార్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో మ‌లయాళ స్టార్ హీరో ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టించారు. సునీల్ (Sunil), అన‌సూయ‌ (Anasuya), అజ‌య్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలకి విపరీతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా పాటలు బాగా వైరల్ అయ్యాయి. 

Also Read: Kapil Dev on Kohli:కెప్టెన్సీ విషయంలో సెలెక్టర్లదే సంపూర్ణ హక్కు , ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News