యాంకర్ అనసూయ.. తెలుగు బుల్లితెరపైనే కాకుండా, వెండితెరపైనా తనని తాను ప్రూవ్ చేసుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ లేడీ. టీవీ షోలు, అవార్డ్స్ షోలలో యాంకర్‌గా చేస్తూనే.. మరోవైపు సినిమాల్లోనూ తానేమీ తీసిపోనని నిరూపించుకున్న యాంకర్ అనసూయ ( Anchor Anasuya ) తాజాగా మరోసారి మహిళలు, అమ్మాయిలు, చిన్నపిల్లలకు బూస్టింగ్‌నిచ్చే వీడియోతో తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఉమెన్ సేఫ్టీ విభాగం ఇటీవల సైబ్‌హర్ #CybHer పేరిట ప్రారంభించిన క్యాంపెయిన్‌లో ఇప్పటికే ప్రముఖ సినీనటుడు నాని, ప్రముఖ యాంకర్ సుమ, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పాల్పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా  యాంకర్ అనసూయ కూడా ఈ #CybHer campaign లో పాల్గొంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లో, సామాజిక మాధ్యమాల్లో మహిళలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న అవమానాలపై పోరాడాల్సిందిగా యాంకర్ అనసూయ ఈ వీడియో ద్వారా సందేశమిచ్చారు. ( Also read: IIT admissions: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐఐటీల్లో ప్రవేశానికి తొలగిన అడ్డంకి )



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చే మహిళలు, అమ్మాయిలు, పిల్లలకు తెలంగాణ పోలీసుల అండదండలు ఉంటాయని, ఉమెన్ సేఫ్టీ వింగ్ అభయం ఉంటుందని యాంకర్ అనసూయ చెప్పిన ఓ వీడియోను ఉమెన్ సేఫ్టీ వింగ్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ( Also read: Gold masks, silver masks: గోల్డెన్ మాస్కులు, సిల్వర్ మాస్కులకు పెరిగిన డిమాండ్.. ధర ఎంతో తెలుసా ? )


ఫ్రైడే ఫ్యాక్ట్ స్టోరీ విత్ యాంకర్ అనసూయ పేరిట తెలంగాణ స్టేట్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ రూపొందించిన ఈ వీడియో చూస్తోంటే... సైబర్ క్రైమ్స్ బారిన పడిన మహిళలు, అమ్మాయిలు, చిన్నారులకు కొండంత అండ లభించినట్టయింది. ఈ క్యాంపెయిన్ ప్రారంభించిన ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పోలీసు ( Women safety wing of Telangana state police ), అందులో భాగమైన వాళ్లను అందరినీ అభినందించి తీరాల్సిందే.


( Also read: COVID-19 treatment: ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యా రాయ్ బచ్చన్, ఆరాధ్య )