Actress Rekha Suicide: యాంకర్, టీవీ నటి రేఖ ఆత్మహత్య
కరోనా వ్యాప్తి కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తడంతో టీవీ నటి, యాంకర్ ఆత్మహత్య (Actress Rekha Suicide) చేసుకుంది. బుధవారం స్నానం చేసేందుకు వెళ్లిన రేఖ బాత్రూమ్‌లో ఉరివేసుకుని బలవన్మరణం చెందింది.
కరోనా వ్యాప్తి కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తడంతో టీవీ నటి, యాంకర్ మద్దెల సబీరా అలియాస్ రేఖ(42) ఆత్మహత్య (Actress Rekha Suicide) చేసుకుంది. గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టాభిపురం పోలీసుల కథనం ప్రకారం.. సింగర్‌గా, నటిగా రాణించాలని ఎన్నో కలలుకన్న రేఖ చాలా కాలం కిందట హైదరాబాద్‌కు వచ్చింది. అవకాశం రావడంతో రెండు సీరియల్స్‌లో నటించింది. ఆపై ఛాన్స్‌లు రాకపోవడంతో వ్యక్తిగత జీవితంపై ఫోకస్ చేసింది. Tea Seller: ఛాయ్‌వాలా బ్యాంక్ లోన్ రూ.50 కోట్లా!
హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్లిపోయింది. అక్కడ తొలుత అహ్మద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరి వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకుంది. వీరికి సంతానం ఓ కుమార్తె ఉంది. ఆ తర్వాత చైతన్య అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో ఆమె వివాహం జరిగింది. పట్టాభిపురంలోని విద్యానగర్‌లో వీరు నివాసం ఉంటున్నారు. Photos: నితిన్, షాలినిల నిశ్చితార్థం ఫొటోలు
స్థానికంగా ఫంక్షన్లు, ఈవెంట్లకు రేఖ యాంకరింగ్ చేయడంతో పాటు సింగర్‌గా రాణిస్తోంది. అయితే కొంతకాలం నుంచి ఆమె కెరీర్‌కు దూరంగా ఉంటోంది. మరోవైపు రెండేళ్లుగా భర్త చైతన్యకు కలిసిరాక అప్పులపాయ్యాడు. ఈ క్రమంలో బుధవారం స్నానం చేసేందుకు వెళ్లిన రేఖ బాత్రూమ్‌లో ఉరివేసుకుని బలవన్మరణం (Actress Rekha Commits Suicide) చెందింది. భర్త చైతన్య ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని బాత్రూమ్ డోర్ పగలగొట్టగా ఉరివేసుకున్న రేఖ అప్పటికే చనిపోయింది.జబర్దస్త్ యాంకర్ Anasuya లేటెస్ట్ ఫొటోలు
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్