Anchor Rashmi: సుధీర్ తోడే కావాలట..అసలు విషయం అలా బయట పెట్టేసిన యాంకర్ రష్మి!
Anchor Rashmi Love on Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ మీద ఉన్న ప్రేమ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు అనే విషయాన్ని తాజాగా రష్మి ఇన్ డైరెక్టుగా ఒక షోలో వెల్లడించింది. దీంతో సుధీర్ ఫాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Anchor Rashmi Comments on Sudigali Sudheer: జబర్దస్త్ ప్రోగ్రాం అప్పుడెప్పుడో 2013 వ సంవత్సరంలో ప్రారంభమై ఇప్పటికి కూడా నిరాటంకంగా దూసుకుపోతోంది. దాదాపు పది ఏళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమం కొనసాగుతూ ముందుకు దూసుకు వెళ్తోంది. మధ్యలో ఎంతో మంది కమెడియన్లు మారారు, జడ్జిలు మారారు, టీం లీడర్లు మారారు కానీ జబర్దస్త్ లోని కామెడీలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రతి గురువారం వచ్చిందంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుని మరి ఈ కార్యక్రమాన్ని చూస్తారు. కేవలం టీవీలోనే కాదు సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా కూడా వీడియోలు చూస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళేందుకు అందరూ పాటుపడుతూ ఉంటారు.
ఇక ఈ జబర్దస్త్ లో క్రేజ్ అందుకున్న వారిలో యాంకర్ రష్మీ ఒకరు. ఆమె పేరు ప్రస్తావిస్తే ఖచ్చితంగా సుధీర్ గురించి కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. నిజానికి వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని, కాదు లేదని, ఈ ప్రోగ్రాం కోసమే సృష్టించారని ఇలా రకరకాల ప్రచారలైతే జరుగుతూ ఉంటాయి. కానీ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం సూపర్ హిట్ అవుతూ ఉంటుంది నిజంగానే ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారేమో అని అనుమానం కలిగించేలా అనేక షోలలో వీరు హంగామా చేస్తూ ఉంటారు. కొన్ని షోలలో అయితే కలిసి పెళ్లి చేసుకుని కూడా అభిమానులను పూల్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ నుంచి సుధీర్ దూరమైపోవడంతో రష్మీ సుధీర్ మధ్య గ్యాప్ పెరిగిపోయిందనే ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది.
Also Read: Custody Censor Report: కస్టడీ సెన్సార్ రిపోర్టు బయటకు.. అందరి నమ్మకం అదేనట!
అయితే సుడిగాలి సుధీర్ మీద ఉన్న ప్రేమ మాత్రం రష్మిలో ఏ మాత్రం తగ్గలేదు అనే విషయాన్ని తాజాగా ఆమె వెల్లడించింది. తన మనసులో ఇంకా సుదీర్ ఉన్నాడనే విషయాన్ని ఒక షో వేదికగా గుర్తుచేసుకుంది యాంకర్ రష్మీ గౌతమ్. తాను ఒంటరిగా ఉండాల్సి వస్తే తాను సుధీర్ తోడు కోరుకుంటానని తాజాగా యాంకర్ రష్మీ కామెంట్ చేసింది. విషయం ఏమిటంటే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి వాటికి యాంకర్ గా ఇప్పటికే కొనసాగుతున్న రష్మీ స్టార్ మా లో ఓంకార్ యాంకరింగ్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ అనే షో కి గెస్ట్ గా వెళ్ళింది.
నటుడు బ్రహ్మాజీతో కలిసి ఆమె సందడి చేయగా రష్మిని బ్రహ్మాజీ ఫ్లర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ ఇద్దరు కలిసి వేసిన పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ ఆసక్తికరంగా సాగింది. ఈ సాంగ్ కు డాన్స్ కూడా ఈ ఇద్దరు అదరగొట్టారని చెప్పాలి. ఇక ఆ తర్వాత రష్మీకి ఒక పరీక్ష పెట్టాడు యాంకర్ ఓంకార్. తన షోలో గెస్ట్ లను ఒక్క సెకండ్ అంటూ సస్పెన్స్ తో చంపేసే ఓంకార్ ఈ షోలో మాత్రం రష్మిని చిక్కుల్లో పడేసే విధంగా ఒక ప్రశ్న స్పందించాడు.
అదేమిటంటే నీతో ఉండడానికి టాలీవుడ్ లో ఏ హీరోని ఎక్స్పెక్ట్ చేస్తారు అని ప్రశ్నించాడు. ఒకరకంగా చెప్పాలంటే ఏ హీరోతో డేట్ చేస్తారు అనే విషయాన్ని ఇలా ఇండైరెక్టుగా అడిగాడు అన్నమాట. ఇక దీనికి మొదట కాసేపు ఆలోచించి తడబడినట్లుగా కనిపించిన రష్మీ ఆ తర్వాత కచ్చితంగా సుడిగాలి సుదీర్ కంపెనీ ఉంటే తనకు చాలా బాగుంటుందని చెప్పేసింది. ఇక ఆమె ఆన్సర్ తో ఆ షోకి హాజరైన ఆడియన్స్ అందరూ పెద్ద ఎత్తున హర్షద్వానాలు తెలిపారు. తాజాగా విడుదలైన ఈ సిక్స్త్ సెన్స్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా చూసేయండి మరి.
Also Read: Akhil Akkineni Next Movie: అఖిల్ కోసం రంగంలోకి ప్రభాస్.. భారీ బడ్జెట్ మూవీ ఫిక్స్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook