Naga Chaitanya’s Custody Censor Report: దిల్ రాజు నిర్మాణంలో విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమా చేశాడు నాగచైతన్య. ఎవరూ ఊహించని విధంగా ఒక ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాని ఎందుకో ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో నాగ చైతన్య హీరోగా తమిళ మానాడు లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు. సినిమా అనౌన్స్ చేసింది మొదలు ఈ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాల పెరుగుతూ వచ్చాయి.
నాగచైతన్య- తమిళ డైరెక్టర్ కాంబో సినిమా కావడం మంచి క్రేజ్ ఉన్న కృతి శెట్టి హీరోయిన్ కావడంతో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద భారీగానే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక కస్టడీ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే తెలుగు ప్రేక్షకులు సహా తమిళ ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ శుక్రవారం నాడు అంటే మే 12వ తేదీన కస్టడీ సినిమాని తెలుగు తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సినిమా యూనిట్ కష్టపడుతోంది. ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీ శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు.
ఈ సినిమాలో నాగచైతన్య ఒక పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడని సినిమా మొదలుపెట్టినప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాల్లో ఒక కొత్త పాయింట్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నట్లు కూడా చెబుతున్నారు. ఎందుకంటే సాధారణంగా సినిమాల్లో విలన్ ని చంపేందుకు లేదా మార్చి మంచి మార్గంలో నడిపించేందుకు హీరో ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఈ సినిమాలో మాత్రం విలన్ ప్రాణాన్ని కాపాడేందుకు హీరో ప్రయత్నిస్తూ ఉంటాడని చెబుతున్నారు.
ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ పూర్తయింది. సెన్సార్ సభ్యులు సినిమా చూసిన తర్వాత యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. అంటే పెద్దల సమక్షంలో పిల్లలు కూడా చూసే విధంగా ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ సినిమాకి 148 నిమిషాలు రన్ టైం లాక్ అయిందని అంటున్నారు. ఇక ఇలాంటి జానర్ సినిమాలకు ఇది పర్ఫెక్ట్ రన్ టైమ్ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమా మీద ప్రశంసల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో అరవిందస్వామి, శరత్ కుమార్, ప్రియమణి, ప్రేమ్జీ అమరేన్, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాని తమిళ తెలుగు భాషలోనే కాకుండా హిందీలో కూడా డబ్బింగ్ చెప్పించి రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంగీతంతో పాటుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ఇళయరాజాతో పాటు ఆయన కుమారుడు శంకర్ రాజా అందిస్తున్నారు.
ఇక ఈ సినిమా నాగచైతన్యకు మాత్రమే కాదు అటు వెంకట ప్రభు, కృతి శెట్టి, నిర్మాణ సంస్థకు కూడా చాలా కీలకం. ఎందుకంటే వెంకట ప్రభు తెలుగు హీరోతో చేస్తున్న మొట్టమొదటి సినిమా కావడం, సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రతి శెట్టి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాతో అందరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. అలాగే వారియర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద ఈ సినిమా వస్తూ ఉండడంతో నిర్మాతలకు కూడా ఈ సినిమా చాలా కీలకం కానుంది.
Also Read: The Kerala Story: 'ది కేరళ స్టొరీ' బ్యాన్ చేసిన వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook