anchor rashmi: మూగజీవాలకు ఏదైనా ప్రమాదం  జరిగితే చలించిపోతుంది బుల్లితెర యాంకర్, వెండితెర నటి  రష్మీ గౌతమ్. ఏ జంతువుకు హాని జరిగినా వెంటనే స్పందిస్తుంది. ఇటీవల ఓ కుక్క గాయపడగా...దాని చికిత్స కోసం విరాళాలు సేకరించాలని రష్మీ నిర్ణయించుకుంది. దీని కోసం సామాజిక మధ్యమాల్ని వేదికగా ఎంచుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల సోష‌ల్ మీడియా(Social Media)లో రష్మీ(anchor rashmi) చాలా చురకుుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు తన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ నెటిజన్లతో ముచ్చటిస్తోంది. తాజాగా ఈ భామ సోష‌ల్ స‌ర్వీస్‌(Social Service) కోసం తన అభిమానులకు ఓ అభ్య‌ర్ధ‌న చేసింది.


Also Read: Ram Charan: జాతీయ జెండాను అవమానించారంటూ చెర్రీపై ట్రోల్స్? అసలు ఏం జరిగింది?


'నెల రోజుల కిందట ఓ కుక్క(Dog) ఆరో అంత‌స్తు నుంచి కింద ప‌డి తీవ్ర గాయాలయ్యాయి.  కాగా ప్రస్తుతం దాని చికిత్స‌కు రోజుకి 300-400 రూపాయల వరకు ఖర్చవుతుంది. అది తిరిగి నడిచేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. నా వంతు సాయం నేను చేస్తున్నా. మీరూ చేస్తారని ఆశిస్తున్నా. ప్లీజ్‌ మీకు తోచినంత సాయం చేయండి. తన్ ఇన్‌స్టాలో ఫాలోవర్స్(Insta Followers)  30 లక్షల మందికి పైగానే ఉన్నారు. మీరందరూ ఒక్కొక్కరు ఒక్క రూపాయి(One Rupee) దానం చేసినా చాలు. అది చాలా పెద్ద‌ సహాయంగా మారి దానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని' తెలిపింది. త‌న ఇన్‌స్టా ద్వారా డొనేట్(Donate) చేయాల్సిన లింక్‌ని కూడా షేర్ చేసింది. ర‌ష్మీ చేస్తున్న ఈ పనికి నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు.


జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలో శునకాలకు ఏబీసీ (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌) ఆపరేషన్‌ చేసి, వాటిని అలాగే వదిలేస్తున్నారని, దీనికి పరిష్కార చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌(KTR)ను ఇటీవల ట్విటర్‌ వేదికగా ఈమె కోరింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook