ఓటిటిలో విడుదల కానున్న Anchor Sreemukhi సినిమా
Anchor Sreemukhi కి బుల్లితెరపై ఉన్న భారీ క్రేజ్ గురించి తెలిసిందే. యాంకర్ శ్రీముఖి అనడం కంటే బుల్లితెర రాములమ్మ అంటే ఆమెను ఇట్టే గుర్తుపట్టేస్తారు. పైగా బిగ్ బాస్ ( Bigg boss Telugu ) పుణ్యమా అని మరింత క్రేజ్ సంపాదించుకుంది కూడా.
Anchor Sreemukhi కి బుల్లితెరపై ఉన్న భారీ క్రేజ్ గురించి తెలిసిందే. యాంకర్ శ్రీముఖి అనడం కంటే బుల్లితెర రాములమ్మ అంటే ఆమెను ఇట్టే గుర్తుపట్టేస్తారు. పైగా బిగ్ బాస్ ( Bigg boss Telugu ) పుణ్యమా అని మరింత క్రేజ్ సంపాదించుకుంది కూడా. బిగ్ బాస్ షో తర్వాత మరోసారి కెరీర్‌పై ఫోకస్ చేసిన యాంకర్ శ్రీముఖి.. రియాలిటీ షోలతో పాటు అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేస్తోంది. గతంలో జులాయి, లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్, నేను శైలజ, సావిత్రి, జెంటిల్మెన్ వంటి సినిమాల్లో నటించిన శ్రీముఖి.. ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రంలో లీడ్ రోల్ ప్లే చేసింది. Also read : Ananya Panday: ఈ హీరోయిన్‌తో పూరి జగన్నాథ్‌కి కొత్త కష్టాలు
అలాగే యాంకర్ శ్రీముఖి నటించిన ఇట్స్ టైమ్ టు పార్టీ అనే సినిమా ( Its time to party movie ) సైతం విడుదలకు సిద్ధమైంది. ఐతే ప్రస్తుతం థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో అన్ని చిత్రాల తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు సదరు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. Also read : Acharya controversy: ఆచార్య కథ కాపీనా ? స్పందించిన నిర్మాతలు
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన ఇట్స్ టైమ్ టు పార్టీ సినిమాను గౌతమ్ ఈవియస్ డైరెక్ట్ చేశాడు. సెప్టెంబర్ 11 న ఈ చిత్రం OTT ప్లాట్‌ఫాంపై విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఏదైనా ఓటిటి ప్లాట్‌ఫామ్‌తో డీల్ ఓకే ఐతే.. ఆ తర్వాత ఈ సినిమా విడుదల గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. Also read : OTT పై యాంకర్ ప్రదీప్ సినిమా ?