Anchor Suma Kanakala: బుల్లి తెర, వెండి తెర ప్రముఖులు ఇటీవల తరచూ వివాదంలో చిక్కుకుంటున్నారు. మంగ్లీ, రాజ్‌ తరుణ్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, ఆర్‌జే శేఖర్‌ భాషా, హేమతోపాటు బిత్తిరి సత్తి చిక్కుల్లో పడ్డారు. తాజాగా తెలుగులో అత్యధిక పారితోషకం అందుకుంటున్న స్టార్‌ యాంకర్‌ సుమ కనకాల వివాదంలో చిక్కారు. ఆమె చేసిన అడ్వర్టైజ్‌మెంట్‌ వివాదంలోకి నెట్టేసింది. అయితే అడ్వర్టైజ్‌మెంట్‌ చేయించుకున్న సంస్థ బోర్డు తిప్పేయడంతో ఆ సంస్థను నమ్మి పెట్టుబడి పెట్టిన వారంతా తీవ్రంగా నష్టపోయారు. అయితే వారంతా యాంకర్‌ సుమ చెప్పడంతోనే తాము పెట్టుబడులు పెట్టామని.. సుమ తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేస్తుండడం కలకలం రేపింది. సుమక్క చెప్పడంతోనే తాము ప్లాట్లు కొన్నామని.. ఇప్పుడు తీవ్రంగా నష్టపోయామని బాధితులు వాపోతున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: NTR - Prashanth Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి ముహూర్తం ఖరారు.. ?


టీవీ, సినిమాలతో బిజీగా ఉండే యాంకర్‌ సుమ.. వాణిజ్య ప్రకటనలతోనూ ఫుల్‌ బిజీగా ఉంటారు. ఆ క్రమంలోనే రాకీ అవెన్యూస్ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు ఆమె ప్రచారం చేశారు. ఆ సంస్థకు చెందిన అడ్వర్టైజ్‌మెంట్‌లలో నటించి ప్రజలను ఆకట్టుకున్నారు. అయితే ఆ సంస్థ తాజాగా బోర్డు తిప్పేసింది. తక్కువ ధరకు ప్లాట్లు ఇస్తామని ప్రచారం చేయడంతో భారీగా ప్రజలు ప్లాట్లు కొనుగోలు కోసం రూ.లక్షల్లో డబ్బులు ఇచ్చారు. ఈ వ్యవహారం రాజమండ్రిలో రచ్చకు దారి తీసింది.

Also Read: Kamal Haasan: బిగ్‌బాస్‌కు అగ్ర హీరో బ్రేక్‌.. ఎందుకు.. ఏం జరిగిందో తెలుసా?


రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రాజమండ్రిలో రూ.26 లక్షలకే సొంత ఇల్లు ఇప్పిస్తామని ఆఫర్ పెట్టింది. దీనికి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్‌లలో సుమ నటించారు. ఆ సంస్థ వాణిజ్య ప్రకటనలను నమ్మిన ప్రజలు లక్షల్లో డబ్బులు చెల్లించి ప్లాట్లు బుక్ చేసుకున్నారు. పెద్ద ఎత్తున స్పందన రావడంతో దాదాపు రూ.88 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. అయితే డబ్బులు తీసుకున్న సంస్థ ఇప్పుడు బోర్డు తిప్పేసింది.


సంస్థ బిచాణా ఎత్తేయడంతో తాము నిండా మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిదో అంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులతో పాటు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో సంస్థకు ప్రచారం చేసిన సుమ కూడా స్పందించాలని కోరుతున్నారు. సుమ ప్రచారం చేయడంతోనే ప్లాట్స్ కొనుగోలు చేశామని.. ఇప్పుడు సుమ తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వివాదంపై సుమ కనకాల స్పష్టమైన ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.



 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter