నీ ఇంటికొస్తా, నట్టింటికొస్తా.. నీ కళ్ల ముందే నీ కూతురితో మాట్లాడతా! జయమ్మ పంచాయతీ భలేగుందే
Jayamma Panchayathi trailer released. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా కొద్దిసేపటి క్రితం `జయమ్మ పంచాయితీ` ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Jayamma Panchayathi movie trailer released by Mahesh Babu: ప్రముఖ యాంకర్, నటి సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'జయమ్మ పంచాయితీ'. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దినేష్, షాలిని జంటగా నటించారు. వేసవి కానుకగా ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా కొద్దిసేపటి క్రితం ట్రైలర్‌ను విడుదల చేసింది.
2 నిమిషాల రెండు సెకండ్ల నిడివి గల జయమ్మ పంచాయతీ ట్రైలర్.. పెద్దనాన్న, పెదనాన్న జయమ్మత్త వస్తుంది అనే డైలాగ్‌తో ఆరంభం అవుతుంది. 'పిల్ల ఫంక్షన్ చేసి వచ్చిన చదివింపులతో మా ఆయనకు ఆపరేషన్ చేయిచేస్తాను', 'పిల్ల పెద్దమనిషవడం, డాక్టర్ ఆపరేషన్ అనడం అంత ఆ దేవుడి ప్లాన్ లాగే ఉంది', 'ఆ పిల్లెవరో గానీ. బాబునిక ఆ శివుడే కాపాడాలి', 'మళ్లీ ఆ బోస్ గాడు ఇటుదిక్కు కనబడితే కాళ్లు ఇరగ్గొడతానని చెప్పండి', 'వస్తా.. నీ ఇంటికొస్తా, నట్టింటికొస్తా.. నీ కళ్ల ముందే నీ కూతురితో మాట్లాడతా' అనే డైలాగ్స్ బాగున్నాయి.
జయమ్మ పంచాయితీ ట్రైలర్‌లో ఎమోషన్స్, డైలాగ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాలో సుమ తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరకానున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన్నట్లుగా ట్రైలర్లోనే చూపించారు. అనారోగ్యంగా ఉన్న భర్త.. కూతురు లవ్ మధ్య సుమ నలిగిపోయే సాధారణ గృహిణి పాత్రను సుమ పోషిస్తుందని ట్రైలర్ చుస్తే అర్ధమవుతోంది. అంతేకాదు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకునేందుకుగ్రామంపై కూడా పోరాటానికి సిద్ధమవుతుంది.
జయమ్మ పంచాయితీ సినిమాను వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మించారు. ఈ చిత్రానికి అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ కూడా బాగుండడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఇప్పటికే నాగార్జున, నాని, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తమవంతు ప్రచారం చేశారు.
Also Read: BSNL 797 Plan: బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 797 రీఛార్జ్ ప్లాన్.. 395 రోజుల వ్యాలిడిటీతో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook