Livingstone Six: బాప్‌రే.. ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో భారీ సిక్సర్‌! లివింగ్‌స్టోన్ బ్యాట్ చెక్ చేసిన రషీద్ ఖాన్

Liam Livingstone hits 117-metre Longest sixes in IPL. లియామ్ లివింగ్‌స్టోన్ 117 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు. దాంతో ఐపీఎల్‌ 2022లో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా లివింగ్‌స్టోన్ నిలిచాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 4, 2022, 10:48 AM IST
  • ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో భారీ సిక్సర్‌
  • ఐపీఎల్‌ 2022లోనే భారీ సిక్సర్‌
  • లివింగ్‌స్టోన్ బ్యాట్ చెక్ చేసిన రషీద్ ఖాన్
Livingstone Six: బాప్‌రే.. ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో భారీ సిక్సర్‌! లివింగ్‌స్టోన్ బ్యాట్ చెక్ చేసిన రషీద్ ఖాన్

Liam Livingstone smashesh longest six in IPL 2022: ఐపీఎల్‌ 2022లో భాగంగా మంగళవారం రాత్రి గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ విధ్వంసం సృష్టించాడు. 10 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. గుజరాత్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ వేసిన 16వ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ ఓవర్లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదిన లివింగ్‌స్టోన్.. ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. దాంతో పంజాబ్ మరో 4 ఓవర్లు ఉండగానే సునాయాస విజయం అందుకుంది. 

16 ఓవర్ తొలి బంతికి లియామ్ లివింగ్‌స్టోన్ 117 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు. దాంతో ఐపీఎల్‌ 2022లో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా లివింగ్‌స్టోన్ నిలిచాడు. ముంబై ఇండియన్స్ ప్లేయర్, జూనియర్‌ డివిల్లియ‌ర్స్‌గా పేరున్న డెవాల్డ్ బ్రెవిస్ 112 మీటర్ల భారీ సిక్స్‌ర్ బాది ఈ సీజన్లో రెండో భారీ సిక్స్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు కూడా లివింగ్‌స్టోన్ 108, 106 మీటర్ల సిక్సర్ బాదాడు. ఐపీఎల్ 2022లో జొస్ బట్లర్ 107 మీటర్ల సిక్సర్ కొట్టాడు. 

ఇక ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత దూరం సిక్సర్ బాదిన ఆటగాడిగా విండీస్ హిట్టర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డుల్లో ఉన్నాడు. 2013లో గేల్ 119 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. 2016లో బెన్ కట్టింగ్ 117 మీటర్ల సిక్సర్ కొట్టి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. లియామ్ లివింగ్‌స్టోన్ కూడా 117 మీటర్ల భారీ సిక్స్‌ బాది మూడో స్థానంలో ఉన్నాడు. డెవాల్డ్ బ్రెవిస్ (112), క్రిస్ గేల్ (112), ఎంఎస్ ధోనీ (112), ఏబీ డివిల్లియ‌ర్స్‌ (111), ఎంఎస్ ధోనీ (111), ఏబీ డివిల్లియ‌ర్స్‌ (111), క్రిస్ గేల్ (111), డేవిడ్ మిల్లర్ (110) వరుసగా ఉన్నారు. 

ఇక 117 మీటర్ల సిక్స్ కొట్టిన తరువాత గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. లియామ్ లివింగ్‌స్టొన్ దగ్గరికి వెళ్లి బ్యాట్‌ను పరిశీలించాడు. ఇందులో ఎమన్నా పెట్టుకొచ్చావా అన్నట్లు రెండుమూడు సార్లు బ్యాట్‌ను మరీ చెక్ చేశాడు. మరోవైపు ఈ సిక్సుకు పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ బిత్తరపోయాడు. బౌలర్ మొహ్మద్ షమీ కూడా ఏం కొట్టావ్ అన్నట్లు ఓ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: BSNL 797 Plan: బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 797 రీఛార్జ్ ప్లాన్.. 395 రోజుల వ్యాలిడిటీతో..!

Also Read: Acharya OTT: అభిమానులకు శుభవార్త.. రెండు వారాల ముందుగానే ఓటీటీలోకి 'ఆచార్య'!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News